»   » కళతప్పనున్న అమీర్‌పేటలోని సారథి స్టూడియో

కళతప్పనున్న అమీర్‌పేటలోని సారథి స్టూడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఓల్డెస్ట్ స్టూడియోల్లో అమీర్‌పేట మైత్రీవనం సమీపంలోని సారథి స్టూడియో ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో నిర్మాణమైన మొదటి సినిమా స్టూడియో ఇదే. ఈ స్టూడియోలో మా ఇంటి మహాలక్ష్మి అనే చిత్రాన్ని మొట్టమొదట చిత్రీకరించారు. ఈచిత్రానికి గుత్త రామినీడు దర్శకత్వం వహించారు.

1956లో నిర్మాణమైన ఈ స్టూడియో 7 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇప్పటి వరకు కొన్ని వేల సినిమాల చిత్రీకరణ ఈ స్టూడియోలో జరిపారు. ఇటీవల పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్'తో పాటు అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి.

Huge loss to Sarathi Studios

టీవీ సీరియళ్లు, ఇతర ఎంటర్టెన్మెంట్స్ టీవీ కార్యక్రమాలు, సినిమా షూటింగులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఉండటంతో....తరచూ ఏదో ఒక షూటింగుతో బిజీబిజీగా ఉంటుంది ఈ స్టూడియో. అయితే ఈ స్టూడియో కళ తప్పబోతోంది. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజుక్టు నిర్మాణంలో భాగంగా స్టూడియోకు సంబంధించిన 7 ఎకరాల నుండి 2.5 ఎకరాలు ప్రభుత్వం సాధీనం చేసుకుంటోంది.

ఈ మేరకు ఇప్పటికే సారథి స్టూడియో యాజమాన్యానికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. 2.5 ఎకరాల వదులుకున్నందుకుగాను మార్కెట్ రేట్ ప్రకారం స్కేర్ యార్డకు రూ. 50 వేల చెప్పున.....రూ. 55 కోట్లు నష్టపరిహారం వారికి అందనున్నట్లు తెలుస్తోంది. ఈ స్థలంలో హైదరాబాద్ మెట్రోరైలుకు సంబంధించిన 'సర్కుల్యేషన్ కమ్ ఇంటర్చేంజ్' స్టేషన్ నిర్మించనున్నారు.

English summary
Hyderabad Metro Rail identified Sarathi Studios land as part of Land Acquisition for the construction of circulation-cum-interchange at Ameerpet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu