రంగస్థలం ఎఫెక్ట్.. బాంబులా పేలింది.. రాంచరణ్, బోయపాటి సినిమా డబ్బింగ్ రైట్స్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి జోరుమీద ఉన్నాడు. ఇటీవల రంగస్థలం చిత్రంతో బాహుబలి తరువాత టాలీవుడ్ లో చరిత్రలోనే రికార్డు విజయాన్ని రంగస్థలం చిత్రంతో అందుకున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న రాంచరణ్ ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటించాల్సి ఉంది. బోయపాటి దర్శకత్వంలోని చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజగా ఈ చిత్ర డబ్బింగ్ హక్కుల గురించి వస్తున్న వార్తలు షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి.

దక్షణాది చిత్రాలకు
సౌత్ స్టార్ హీరోల చిత్రాలకు సాధారణంగా హిందీలో పెద్దగా మార్కెట్ ఉండదు. కానీ బాహుబలి చిత్రం తరువాత పరిస్థితి మారిపోయిందని చెప్పొచ్చు. తెలుగు స్టార్ హీరోల చిత్రాలకు కూడా హిందీలో మంచి మార్కెట్ లభిస్తోంది. తాజగా రాంచరణ్, బోయపాటి చిత్ర హిందీ హక్కుల కోసం ఓ నార్త్ ఇండియన్ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బాంబులా పేలిన ధర
రాంచరణ్ బోయపాటి చిత్ర హిందీ హక్కులని 21 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది నిజంగా షాకిచ్చే ఆఫర్ అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు./

రంగస్థలం ఎఫెక్ట్
రంగస్థలం చిత్రం సాధించిన ఘన విజయం తరువాత రాంచరణ్ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రాంచరణ్, బోయపాటి చిత్ర హిందీ రైట్స్ కు ఈ స్థాయిలో ధర పలకడం ఇది కూడా ఓ కారణం అని చెబుతున్నారు.

కైరా అద్వానీ, వివేక్ ఒబెరాయ్
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కైరా అద్వానీ, విలన్ పాత్రలో కనిపించబోతున్న వివేక్ ఒబెరాయ్ హిందీ నేపథ్యం ఉన్న నటులే కావడం కూడా ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి ఓ కారణంగా చెప్పవచ్చు.

మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్
రంగస్థలం చిత్రంలో చిట్టి బాబు పాత్రలో మెప్పించిన రాంచరణ్ బోయపాటి చిత్రంలో యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టబోతున్నాడు.కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











