Don't Miss!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శర్వానంద్ సినిమాకు భారీ ఓటీటీ ఆఫర్.. టెంప్ట్ అవుతున్న నిర్మాతలు
టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లు ఎక్కువవుతున్నాయి. మొన్నటివరకు తమిళ్, హిందీలోనే ఎక్కువ సినిమాలు డీజిటల్ వరల్డ్ లో సింపుల్ గా విడుదలయ్యాయి. దాదాపు అన్ని సినిమాలకు ఎంతో కొంత ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. మరికొందరు మంచి ఆఫర్స్ వచ్చినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. థియేటర్లు ఓపెన్ కాకపోతే మరో రెండు నెలల్లో తెలుగులో కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానున్నాయి.
ఇక శర్వానంద్ కొత్త సినిమా కోసం కూడా ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ హీరో నెక్స్ట్ వ్యవసాయ నేపథ్యంలో తెరకెక్కిన 'శ్రీకారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. శతమానం భవతి వంటి సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంతగానో మెప్పించిన శర్వా ఇప్పుడు అదే తరహాలో పచ్చని పల్లెటూరి వాతావరణంలో శ్రీకారం అనే సినిమాతో జనాలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు.
శ్రీకారం కోసం ఓ వర్గం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు అర్థమవుతోంది. దీంతో సినిమాకు డీజిటల్ వరల్డ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఒకవైపు అమెజాన్ ప్రైమ్, మరోవైపు జీ5 కంపెనీలు శర్వానంద్ నటించిన శ్రీకారం ఓటీటీ రైట్స్ కొసం భారీ ఆఫర్స్ తో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జీ5 ఒకేసారి శాటిలైట్, ఓటీటీ రైట్స్ అందుకోవాలని లాభదాయకంగా ఉండే రేటు చెప్పారట. అందుకు నిర్మాతలు కాస్త టెంప్ట్ అవుతున్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.