అరవింద సమేతపై భారీగా అంచనాలు.. 80 కోట్ల వరకు!
Recommended Video

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న అరవింద సమేత చిత్రంపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. వీరి కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. బలమైన యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. భారీ నెలకొన్న అంచనాలతో ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అదేస్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజగా అరవింద సమేత ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

80 కోట్ల వరకు
అరవింద సమేత చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 80 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వరుస విజయాలు
ఎన్టీఆర్ ఇటీవల వరుసగా విజయాలు సాధిస్తుండడం కూడా అరవింద సమేత చిత్రానికి కలసివచ్చే అంశం. ఎన్టీఆర్ చివరగా నటించిన జై లవకుశ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

దసరాకు విడుదల
అరవింద సమేత చిత్రం దసరా కానుకగా విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లోని ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

పూజా హెగ్డే హీరోయిన్ గా
అరవింద సమేత చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల వరుసగా అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











