ఎన్టీఆర్ పక్కాగా 100 కోట్లు కొట్టాలి, లేకుంటే.. షాక్ ఇస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం అరవింద సమేత వీర రాఘవ. అరవిందగా పూజ హెగ్డే, వీర రాఘవగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై ఏస్థాయిలో అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. చిత్ర విడుదలకు వారం రోజుల ముందు నుంచే హంగామా మొదలైపోయింది. తాజాగా అరవింద సమేత చిత్రానికి జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

భారీ అంచనాలు
అరవింద సమేత చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. త్రివిక్రమ్ టేకింగ్, ఎన్టీఆర్ నటన అదిరిపోయేలా ఉందని వార్తలు వస్తుండడంతో ఈ చిత్రం ఘనవిజయం సాధించడం ఖాయం అని ఎన్టీఆర్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

త్రివిక్రమ్ తొలిసారి
ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ గతంలో ఆది వంటి ఫ్యాక్షన్ చిత్రాలలో నటించాడు. కానీ త్రివిక్రమ్ ఈ తరహా చిత్తాన్ని తెరకెక్కించడం మాత్రం ఇదే తొలిసారి. ఎన్టీఆర్ డైలాగులు రాయలసీమ యాసలో ఉంటూ ఆకట్టుకుంటున్నాయి.

అదిరిపోయేలా ప్రీరిలీజ్ బిజినెస్
అరవింద సమేత ప్రీరిలీజ్ బిజినెస్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు 93 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ లో ఇది బెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో వివిధ ఏరియాలలో ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్ భారీ ధర వెచ్చించిన హక్కులు సొంతం చేసుకున్నారు.

ఏరియాల వారీగా బిజినెస్
కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోని అరవింద సమేత థియేట్రికల్ హక్కులు 71 కోట్ల ధర పలికినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాలో భారీ స్థాయిలో 19.50 కోట్లు, సీడెడ్ లో 15 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో 9.20 కోట్లకు పంపిణీదారులు థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నారు.

ఎన్టీఆర్ టార్గెట్
భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ జరగడంతో సినిమా విజయం సాధించాలంటే కూడా అదేస్థాయిలో వసూళ్లు రాబట్టాలి. అరవింద సమేత చిత్రం 100 కోట్ల షేర్ వసూలు చేస్తే సూపర్ హిట్ జాబితాలో నిలుస్తుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో హిట్ టాక్ వస్తే 100 కోట్లు రాబట్టడం నల్లేరుపై నడకే.


Click it and Unblock the Notifications











