విశ్వంభర దర్శకుడికి ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తెలుసా?.. బింబిసార డైరెక్టర్ ఇన్స్పిరేషన్ జర్నీ మీకు తెలుసా?
సినీ పరిశ్రమలో ఏ క్రాఫ్ట్ లో తీసుకున్నా కూడా ఆయా నటులు లేదా టెక్నీషియన్స్ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం కెరీర్ స్టార్టింగ్ లోనే పెద్ద ఆఫర్స్ అందుకోవడం అనేది ఒకింత కత్తి మీద సాము లాంటిదే అని చెప్పాలి. కానీ ఒక్క రోజు చాలు ఆ హీరో లేదా హీరోయిన్, దర్శకుడు తాలూకా ఫేట్ ని మార్చేయడానికి అలా వచ్చిన స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఇంకా దర్శకులు కూడా చాలా మందే ఉన్నారు.
మరి అలాంటి ప్రస్తుత యువ దర్శకుల్లో లేటెస్ట్ సెన్సేషన్ వశిష్ఠ కూడా ఉన్నాడట. కాగా దర్శకుడు వశిష్ట తెలుగులో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో చేసిన భారీ ఫాంటసీ సినిమా "బింబిసార" తో లైమ్ లిట్ లైట్ లోకి వచ్చాడు. కాగా ఆ ఒక్క సినిమా తోనే సత్తా చాటిన ఈ యువ దర్శకుడు తన రెండో సినిమాగా ఇండస్ట్రీలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో వర్క్ చేసే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు.

సరే ఇది బాగానే ఉంది కానీ చిరు స్టాండర్డ్స్ ని రీచ్ అవుతాడా లేదా అనుకుంటే తాను గట్టి కాన్ఫిడెన్స్ గానే ఉన్నాడు కానీ రీసెంట్ టీజర్ తో మాత్రం కొంచెం నెగిటివ్ ని ఎదుర్కోక తప్పలేదు. కానీ తాను చూపించిన విజువల్స్ లో కొన్ని ఏరియాల్లో విజన్ మాత్రం మైండ్ బ్లాకింగ్ అని చెప్పొచ్చు. కాగా వశిష్ట ఇపుడు చేస్తున్న విశ్వంభర కి మాత్రం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.
తన మొదటి సినిమాకి కేవలం నెల జీతం లెక్కన మాత్రమే తన పారితోషికం అందుకున్నాడట. అలాంటి భారీ సినిమా తెరకెక్కించిన దర్శకుడికి నెల జీతం లెక్కనా అంటే.. కొన్ని కొన్ని నమ్మేలా ఉండకపోవచ్చు కానీ ఈ రంగుల ప్రపంచంలో అలానే ఉంటుంది. ఉదాహరణకి విజయ్ దేవరకొండనే తీసుకుందాం.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమానే తీసుకుందాం అందులో తాను డబ్బున్నవాడిలా గోల్డ్ ఫేజ్ ఏరియా వాడిలా కనిపిస్తాడు కానీ ఆ షూటింగ్ టైం కి తాను ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులలో ఉన్నానని తాను ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సో ఈ లెక్కన బింబిసార దర్శకుడు ఆ సినిమాకి నెల జీతానికి పని చేసాడు అనుకోవడంలో తప్పు లేదు. అయితే ఆ సినిమా హిట్ తో తన ఫేట్ మారింది. అలా విశ్వంభర కి ఏకంగా తాను 2 కోట్ల రెమ్యునరేషన్ ని అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇది మాత్రం తన కెరీర్ లో మంచి జంప్ అని చెప్పాలి.
కాగా ఇపుడు విశ్వంభర పనుల్లోనే తాను బిజీగా ఉన్నాడు. మొన్న టీజర్ పై వచ్చిన ట్రోల్స్ పై విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి నిజానికి ఈ రానున్న జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా అక్కడ నుంచి వాయిదా పడి ఆ స్లాట్ ని మెగాస్టార్ వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఇచ్చారు. మరి విశ్వంభర విడుదల ఎపుడు ఏంటి అనేది ఇంకా ఎలాంటి సమాచారం లేదు.


Click it and Unblock the Notifications











