నాని 'ఫ్యామిలీ పార్టీ'లో ఇరగదీసిన సాయిపల్లవి.. అంతా కలిసి కుమ్మేశారంతే(వీడియో)
Recommended Video

వరంగల్ ప్రీ-రిలీజ్ వేడుకతో ఎంసీఏ చిత్ర యూనిట్ మంచి జోష్‌లో ఉంది. సాయిపల్లవి-నానిల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూడటం కోసం యూత్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఎంసీఏ అంటే ఇప్పటిదాకా మిడిల్ క్లాస్ అబ్బాయి పేరే ఎక్కువగా ప్రచారంలో ఉంది. కానీ మిడిల్ క్లాస్ ఆడియెన్స్ అంటూ దానికి మరో డెఫినిషన్ చెప్పి.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేశారు.
అంతేనా! ఫ్యామిలీ పార్టీ అంటూ మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసి.. ఇది పక్కా కుటుంబ కథా చిత్రం అని చెప్పకనే చెబుతున్నారు. డిసెంబర్ 21న విడుదలకు సిద్దమైన ఈ సినిమాకు సంబంధించి ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ విశేషాలు..

ఫ్యామిలీ పార్టీ సాంగ్:
ఫ్యామిలీ పార్టీ.. అంటూ సాగే ఈ పాట భూమిక-రాజీవ్ కనకాల పెళ్లి నేపథ్యంలో జరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా కలిసి జోష్ లో డ్యాన్స్ చేస్తున్న ఈ ట్రైలర్ ఇప్పటికే చాలామందిని ఆకట్టుకుంది.

ఇరగదీసిన సాయిపల్లవి:
ఫిదా సినిమాలో 'వచ్చిండే.. మెల్ల మెల్లగా వచ్చిండే..' అంటూ ఇరగదీసిన సాయిపల్లవి.. తాజాగా విడుదలైన ఫ్యామిలీ పార్టీ సాంగ్ లోను తనదైన స్టెప్పులతో అలరించింది. సాయిపల్లవి స్టెప్స్ చూస్తుంటే మరోసారి డ్యాన్సులు ఇరగదీసినట్లే కనిపిస్తోంది.

కుమ్మేశారంతే
ఫ్యామిలీ పార్టీ సాంగ్‌లో పెళ్లి చూపులు ప్రియదర్శి, నరేష్, ఇలా అంతా కలిసి డ్యాన్స్ చేయడం గమనించవచ్చు. పెళ్లి తంతు మొత్తాన్ని కవర్ చేసేలా ఈ సాంగ్ చిత్రీకరించినట్లు అర్థమవుతోంది. మొత్తానికి అంతా కలిసి ఫ్యామిలీ పార్టీని ఫుల్లుగా ఎంజాయ్ చేశారన్నమాట.
10లక్షలు దాటింది..
ఎంసీఏ 'ఫ్యామిలీ పార్టీ' పాటకు నెటిజెన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ట్రైలర్ విడుదల చేసిన కొద్దిసేపట్లోనే 10లక్షల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. నిర్మాత దిల్ రాజు, హీరో నాని సినిమా విజయంపై ధీమాగా ఉన్నారు. చూడాలి మరి.. ఎంసీఏ ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో!


Click it and Unblock the Notifications











