వైభవంగా సాగుతున్న కృష్ణ వ్రింద విహారి పాదయాత్ర

హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య ఇప్పటి వరకూ సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ పతాకం పై చేసిన సినిమాలన్నీ హిట్ట్ బాట పట్టాయి అన్న విషయం తెలిసిందే. ఇదే ఎనర్జీతో 'క్రిష్ణ వ్రింద విహారి'గా దూసుకువస్తున్న శౌర్య చాలా ప్రామిస్సింగ్ గా కనిపిస్తున్నాడు. వచ్చే వారమే రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలో రొటీన్ ప్రమోషన్స్ కు భిన్నంగా ప్రేక్షకులతో మమేకం అయ్యేందుకు పాదయాత్ర చేపట్టిన చిత్ర బృందానికి అభిమానులు బ్రహ్మరథం పట్టేస్తున్నారట.

ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. ఇక ఇదే ఊపుతో రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన సాంగ్ ప్రోమో కూడా అదిరిపోయిందనే చెప్పాలి. ఒకదానికి మించి మరొకటి అన్నట్లు సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ ప్రేక్షకుల్లో అంచనాలను అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతున్నాయి.

Huge response to Krishna Vrinda Vihari March

దీనికి తగ్గట్లే పాదయాత్రకు మంచి స్పందన కూడా లభిస్తోంది. ఇటీవలే తిరుపతి, నెల్లూరు, ఒంగోలులో పాదయాత్ర నిర్వహించగా అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజు విజయవాడ, గుంటూరు, ఏలూరులో యాత్ర కొనసాగనుంది. ఇక్కడ కూడా భారీ ఎత్తున అభిమానులు వస్తారని అంచనా. ఇక 17న భీమవరం, రాజమండ్రి, 18న కాకినాడ, విశాఖపట్నంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్ర ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలన్నదే చిత్ర బృందం ప్రయత్నం.

Huge response to Krishna Vrinda Vihari March

అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షెర్లీ సేటియా హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటి రాధిక శౌర్య తల్లిగా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ట్రైలర్ లో శౌర్య సూపర్ ఇన్నోసెంట్ కుర్రాడిలా కనిపించబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే.

Huge response to Krishna Vrinda Vihari March

సినిమాలో వెన్నల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తమదైన స్టైల్ లో అలరించబోతున్నారని అర్ధమవుతోంది. మహతి స్వరసాగర్ అందించిన స్వరాలు కూడా ఆహ్లాదంగా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి అని చెప్పాలి. మరి సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానున్న 'కృష్ణ వ్రింద విహారి' ఈ అంచనాలను అందుకుంటాడో లేదో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X