షాకింగ్: ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్న తేజ.. బాలయ్యతో విభేదాలు, కొత్త దర్శకుడిగా ఆయన పేరు!

నందమూరి అభిమానులకే కాదు, తెలుగు సినీ అభిమానులకు కూడా ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నుంచి దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. బాలయ్యతో వచ్చిన విభేదాల వలనే తేజ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ స్వయంగా తన తండ్రి పాత్రలో కనిపిస్తూ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు.

Recommended Video

NTR biopic:ఎన్టీఆర్ జీవిత చరిత్రలో నందమూరి వారసులు

ఇటీవల ఈ చిత్రం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అవుతుందని ఇటీవల బాలయ్యే ప్రకటించారు. కానీ అంతలోనే దర్శకుడు తేజ ఈ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించడం సంచలనమే కాదు షాకింగ్ కూడా. ఈ చిత్ర కొత్త దర్శకుడిగా రాఘవేంద్ర రావు పేరు వినిపిస్తోంది.

 నిర్ణయమే సంచలనం

నిర్ణయమే సంచలనం

ఎన్టీఆర్ లాంటి ప్రజా నాయకుడి జీవిత చరిత్ర వెండి తెరపై తెరకెక్కించాలనే నిర్ణయమే సంచలం. గత ఏడాది బాలయ్య ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంచలనం ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో చీకటి, వెలుగు రెండు కోణాలు ఉన్నాయి. ఎన్టీఆర్ నటుడిగా చరిత్రలో నిలిచిపోయేలా సాధించిన విజయాలు. రాజకీయాల్లో ఆయన సత్తా చాటిన విధానం, చివరిరోజుల్లో ఆయన ఎదుర్కొన్నకష్టాలు తెలుగువారందరికీ తెలిసిన అంశాలే.

రాంగోపాల్ వర్మ అంటూ ప్రచారం

రాంగోపాల్ వర్మ అంటూ ప్రచారం

బాలయ్య తన తండ్రి బయోపిక్ తెరకెక్కించాలని నిర్ణయం ప్రకటించిన తరువాత దరర్శకుడిగా రాంగోపాల్ వర్మ పేరు వినిపించింది. వర్మ ఆ సమయంలో ఎన్టీఆర్ పేరుమీద ఓ సాంగ్ ని కూడా విడుదల చేసారు. కానీ చివరకు ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దర్శకుడు తేజ దక్కించుకున్నాడు.

తెరపైకి లక్ష్మీస్ ఎన్టీఆర్

తెరపైకి లక్ష్మీస్ ఎన్టీఆర్

తనకు ఎన్టీఆర్ జీవిత చరిత్రని తెరకెక్కించే అవకాశం దక్కలేదని వర్మ మస్తాపం చెందాడో ఏమో కానీ వెంటనే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని తెరపైకి తీసుకుని వచ్చాడు. తనకు ఎన్టీఆర్ బయోపిక్ తో సంబంధం లేదని లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ మధ్య జరిగిన ఎమోషనల్ సంఘటనలని మాత్రం ఈ చిత్రంలో చూపిస్తానని తెలిపాడు. అప్పట్లో ఇది వివాదంగా మారింది. ఆ తరువాత ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది.

తేజ సంచలన నిర్ణయం

తేజ సంచలన నిర్ణయం

అంతా ఒకే అనుకుంటున్న సమయంలో దర్శకుడు తేజ భారీ షాక్ ఇచ్చాడనే చెప్పొచ్చు. నేనే రాజు నేనే మంత్రి చిత్రం విజయం తో ట్రాక్ లోకి వచ్చిన తేజకు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గోల్డెన్ ఆఫర్ అని అంత భావించారు. కానీ తాను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన సినీవర్గాలని షాక్ కి గురిచేస్తోంది.

 అసలేమైంది

అసలేమైంది

తేజ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నుంచి తప్పుకోవడానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. బాలయ్య, తేజ మధ్య కథ విషయంలో విభేదాలు తలెత్తినట్లు ప్రాధమికంగా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూపించాలి, ఏ కోణాల్లో ఎన్టీఆర్ పాత్రని ఆవిష్కరించాలి అనే అంశాల్లో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త దర్శకుడిగా ఆయన పేరు

కొత్త దర్శకుడిగా ఆయన పేరు

అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుతారనేది ఆసక్తిగా మారింది. ఈ చిత్ర కొత్త దర్శకుడిగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పేరు వినిపిస్తోంది. మిగిలిన అంశాలపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయవలసి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X