'కెమెరామేన్ గంగతో..'కోసం పద్మాలయలో భారీగా
పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం నిమిత్రం పద్మాలయా స్టూడియోలో భారి సెట్ వేస్తున్నారు. ఓ స్పెషల్ న్యూస్ టీవీ ఛానెల్ సెట్ ని అక్కడ వేసారు. ఈ నెల 11 నుంచి 17 వ తేదీ వరకూ ఇక్కడ షూటింగ్ జరగనుంది. ఇక సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారని సమాచారం.
అలాగే పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని కలసే సీన్స్ కూడా ఇక్కడే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని పిలిచి ఆ సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు.
అలాగే 'గబ్బర్‌సింగ్' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్ సినిమాగా బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. వచ్చే అక్టోబర్ 18న దీనిని విడుదల చేయడానికి పూరి జగన్నాథ్ ప్లాన్ చేశాడు.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్


Click it and Unblock the Notifications











