అసిన్‌కు హాలీవుడ్ ఎక్స్‌మెన్ నుంచి సందేశం(వీడియో)
ముంబై: సౌత్‌లో సినిమా కెరీర్ మొదలు పెట్టి ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మళయల భామ అసిన్ ప్రస్తుతం దక్షిణాది సినిమాలకు దూరమై పూర్తిగా బాలీవుడ్‌పై తన దృష్టి కేంద్రీకరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 26 గ్రాండ్‌గా తన పుట్టినరోజు వేడుక జరుపుకుని 28వ వసంతంలోకి అడుగు పెట్టింది అసిన్.
అసిన్‌కు కేవలం బాలీవుడ్ ప్రముఖల నుండి మాత్రమే కాదు....హాలీవుడ్ స్టార్, సూపర్ హిట్ ఎక్స్‌మెన్ సిరీస్ సినిమాల హీరో హ్యుగ్ జాక్‌మెన్ నుంచి కూడా శుభాకాంక్షలు అందాయి. అసిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశం పంపాడు. అంత పెద్ద హాలీవుడ్ స్టార్ నుంచి సందేశం అందడంతో సంతోషంతో ఉబ్బితబ్బబ్బవుతోంది అసిన్.
'అసిన్, నేను నీతో ఫోన్లో మాట్లాడినపుడే నీలో బ్యూటిఫుల్ ఎనర్జీ ఉందని తెలుసుకున్నాను. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. వచ్చే సారి తప్పకుండా నిన్ను కలిసి విష్ చేస్తాను. త్వరలోనే నిన్ను చూస్తానని ఆశిస్తున్నాను. హాపీ బర్త్ డే' అంటూ హ్యుగ్ జాక్‌మెన్ అసిన్‌కు వీడియో సందేశం పంపాడు. అందుకు సంబంధించిన వీడియో స్వయంగా చూడటానికి క్రింద క్లిక్ చేయండి.
గతంలో జరిగిన పలు సినిమా ఫంక్షన్లలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరూ అసిన్, హ్యుగ్ జాక్ మెన్ న్యూయార్కులో కలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. హ్యుగ్ జాక్ మెన్ లాంటి వరల్డ్ క్లాస్ హీరోతో స్నేహం, అతని నుంచి శుభాకాంక్షలు అందడంతో చాలా హ్యాపీగా ఉంది అసిన్. 'హ్యుగ్ జాక్‌మెన్‌తో కేవలం పరిచయం మాత్రమే ఉంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే మాట్లాడాను. అతని నుంచి ఇలాంటి స్వీట్ మెసేజ్ వస్తుందని అసలు ఊహించలేదు' అని అసిన్ చెప్పుకొచ్చింది.స


Click it and Unblock the Notifications












