మనస్సుకు హత్తుకొనేలా ఉండాలంటున్నా దర్శక ధీర!!
'మగధీర" ఘన విజయం సాధించడంతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని తన గురించి ఆలోచింపజేసేలా చేశాడు రాజమౌళి. తెలుగు చలన చిత్ర రికార్డులను తిరగరాసిన 'మగధీర"ను సృష్టించి దర్శకధీర అయ్యారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సునీల్ హీరోగా 'మర్యాద రామన్న" చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'స్టూడెంట్ నెం.1" చిత్రం లా లోబడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇది కాక ఓ స్ర్కిప్ట్ వర్క్ లో పాలు పంచుకున్నారు. తనదైన శైలిలో సలహాలు ఇస్తూ మార్పులు సూచించారు. మొత్తం మీద ఆ స్ర్కిప్ట్ లో రాజమౌళి చేయి కూడా పడిందన్న మాట. కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్ధ, శృతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రమే అది. సినిమా షూటింగ్ ఇటీవల రామోజీ ఫిలిం సిటిలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ 'ఈ సినిమా స్ర్కిప్ట్ చదవడం మర్పులు చేర్పులు చేయడం కూడా జరిగింది. ఇప్పుడున్న జనరేషన్ కు తగ్గట్టు హ్యూమన్ ఎమోషన్స్ ప్రజెంట్ చేసే విధానం కొత్తగా ఉండాలని తెలియజేశారు. ఇప్పటి వరకు మతకలహాలను పలువురు దర్శకులు విభిన్న కోణాలలో చూపించారు. ప్రకాష్ చూపే విధానం కూడా సున్నితంగా సుతిమెత్తగా మనసులను హత్తుకునేలా ఉంటుంది అన్నారు.


Click it and Unblock the Notifications











