twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దారుణం.. ఇదో క్రిమినల్ మేటర్: కత్తి-పవన్ ఫ్యాన్స్ వివాదంపై బాబు గోగినేని

    |

    Recommended Video

    కత్తి-పవన్ ఫ్యాన్స్ వివాదంపై.. బాబు గోగినేని షాకింగ్ కామెంట్స్ !

    పవన్ కల్యాణ్ ఫ్యాన్స్-మహేష్ కత్తి మధ్య జరుగుతున్న రగడ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి కూడా చాలామంది వెనుకాడుతున్న పరిస్థితి. ఏ కామెంట్ చేస్తే.. ఎక్కడ తాము ఇరకాటంలో పడిపోతామేమోనన్న భయం చాలామందిని వెంటాడుతోంది.

    తెగేదాకా వచ్చింది: 'కత్తి'కి కోన వెంకట్ డెడ్ లైన్?, ఆరోజు ఏం చేస్తారు?; సీన్ లోకి వేణుమాధవ్..తెగేదాకా వచ్చింది: 'కత్తి'కి కోన వెంకట్ డెడ్ లైన్?, ఆరోజు ఏం చేస్తారు?; సీన్ లోకి వేణుమాధవ్..

    ఇలాంటి తరుణంలో ప్రముఖ మానవవాది, హేతువాది అయిన బాబు గోగినేని జరుగుతున్న వివాదంపై స్పందించారు. ఇంతకీ ఆయనేమన్నారు..

     దారుణం.. ఇదో క్రిమినల్ మేటర్..:

    దారుణం.. ఇదో క్రిమినల్ మేటర్..:

    'మహేశ్ కత్తికి శ్రద్ధాంజలి అంటూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు చేస్తున్నారు. నాకు తెలినంతవరకు ఒక బతికున్న మనిషిని చనిపోయాడని చెప్పడం దారుణమైన విషయం.. అంతకన్నా ఎక్కువ ఇదో క్రిమినల్ మేటర్'

     నష్టం ఇద్దరికీ..:

    నష్టం ఇద్దరికీ..:

    క్రిమినల్ మేటరా? కాదా? అన్నది పక్కనపెడితే.. మహేశ్ కత్తికి, పవన్ కల్యాణ్‌కి ఇద్దరికీ హక్కులు ఉంటాయి. ఈ వివాదంలో ఇద్దరి వ్యక్తులను కించపరుస్తున్నారు. తమ తమ ఫ్యాన్స్ ఇలా చేస్తోన్న కారణంగా నష్టపోయేది పవన్ కల్యాణ్, మహేశ్ కత్తి మాత్రమే.

     అందరూ మెచ్చుకోవాల్సిందే అనడం తప్పు:

    అందరూ మెచ్చుకోవాల్సిందే అనడం తప్పు:

    విమర్శించడం వేరు.. రాళ్లు వేయడం, బురద చల్లడం వేరు.మా అభిమాన స్టార్‌ని అందరూ మెచ్చుకోవాల్సిందే అనడం తప్పు. అలాగే విమర్శిస్తే చంపేస్తాం అని బెదిరించడం కూడా తప్పు.

    కొడుతామంటేనే తప్పు.. అటువంటిది చంపేస్తామని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. సమన్వయం పాటించాల్సిన అవసరముంది.

     ఇష్టం లేకపోతే..:

    ఇష్టం లేకపోతే..:

    ఇష్టం లేకపోతే పవన్ కల్యాణ్ సినిమాలు చూడకూడదు. ఇష్టం లేకపోతే మహశ్ కత్తి చేస్తోన్న ట్వీట్లను చూడకుండా ఉండండి.-బాబు గోగినేని.

    ఆరోజు తర్వాత ఏం జరుగుతుందో..:

    ఆరోజు తర్వాత ఏం జరుగుతుందో..:

    బాబు గోగినేని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే, ఈ నెల 15వ తేదీ వరకు సంయమనం పాటించాల్సిందిగా రచయిత కోన వెంకట్ ఇరు వర్గాలను కోరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నేరుగా పవనే రంగంలోకి దిగుతారా?, మధ్యవర్తుల ద్వారా వివాదాన్ని సద్దుమణిగేలా చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

    English summary
    Babu Gogineni being a rationalist and human rights activist responded over Pawan Kalyan fans and Mahesh Kathi issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X