మనుషుల్లారా జాగ్రత్త.. బాలీవడ్ గోల్డ్ రాక్షస గద్ద అవుతున్నాడు!
విలక్షణ నటుడు సాహసాల వీరుడు అక్షయ్ కుమార్ 51వ పుట్టినరోజు నేడు. బాలీవడ్ లో ఎంతమంది స్టార్స్ ఉన్నా అక్షయ్ కుమార్ సినిమాలకు మాత్రం ఎప్పుడూ బ్రేక్ ఉండదు. అక్షయ్ కుమార్ నటించే చిత్రాలు వేగంగా పూర్తవుతుంటాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా అక్షయ్ కుమార్ కింగే. సినిమా హిట్ అయితే చాలు 100 కోట్లు అవలోకగా అక్షయ్ కుమార్ చిత్రం వసూలు చేస్తుంది. ఇటీవల గోల్డ్ చిత్రంతో హిట్ కొట్టిన అక్షయ్ కుమార్ త్వరలో 2.0 చిత్రంలో అరవీర భయంకరమైన పాత్రతో మన ముందుకు రాబోతున్నాడు.

బాలీవడ్ గోల్డ్
అక్షయ్ కుమార్ ఇటీవల గోల్డ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. నిజంగానే అక్షయ్ కుమార్ బాలీవుడ్ గోల్డ్ అని చెప్పొచ్చు. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా తన పని తాను చేసుకుపోతుంటాడు.

51వ జన్మదినం
అక్షయ్ కుమార్ నేడు 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడమే కాదు సాహసోపేతమైన స్టంట్స్ ని డూప్ లేకుండా చేస్తుంటాడు. ప్రపంచంలో మోస్ట్ పైడ్ నటుడిగా ఈ ఏడాది అక్షయ్ కుమార్ స్థానం సంపాదించాడు. ఏడాదిలో అక్షయ్ కుమార్ నుంచి కనీసం రెండు చిత్రాలు విడుదలవుతుంటాయి.

మార్షల్ ఆర్ట్స్
అక్షయ్ కుమార్ కు మార్షల్ ఆర్ట్స్ లో కూడా నైపుణ్యం ఉంది. 51 ఏళ్ళు నిండిన ఈ క్రేజీ హీరోకి సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్కంఠ రేపేలా
అక్షయ్ కుమార్ శంకర్ కలల ప్రాజెక్ట్, సూపర్ స్టార్ రజని నటించిన 2.0 చిత్రంలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ రోల్ ఉత్కంఠ కలిగించే విధంగా ఉంది. ఈ చిత్రంలో అక్షయ్ కి సంబందించిన పోస్టర్స్ అద్భుతంగా ఉన్నాయి.

టీజర్ త్వరలో
వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13 న 2.0 టీజర్ విడుదల చేయనున్నారు. దీనికి సంబందించిన పోస్టర్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. రాక్షస గద్దలా ఉన్న పోస్టర్ ని ట్వీట్ చేస్తూ.. మనుషులంతా జాగ్రత్త అంటూ కామెంట్ పెట్టాడు. అక్షయ్ పాత్ర ఈ చిత్రంలో ఎంత భయంకరంగా ఉండబోతోందో అర్థం అవుతోంది.

2.0 టీమ్
2.0 చిత్ర టీమ్ అక్షయ్ కుమార్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. రాక్షస గద్ద ఆకారంలో కేక్ తయారు చేయించి అక్షయ్ కు బర్త్ డే విషెష్ తెలిపింది.


Click it and Unblock the Notifications











