»   » చచ్చాను పో...... నాగార్జునకు ఛాలెంజ్‌కు నాని ఫన్నీ రిప్లై!

చచ్చాను పో...... నాగార్జునకు ఛాలెంజ్‌కు నాని ఫన్నీ రిప్లై!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' అంటూ దేశ వ్యాప్తంగా ఫిట్‌నెస్ ఛాలెంజ్ జోరుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ సినీ స్టార్లు స్వీకరిస్తూ తమ తోటి స్టార్లను ఛాలెంజ్ చేస్తుండటంతో ఇది మరింత వైరల్ అయింది. తన కుమారుడు అఖిల్ నుండి ఫిట్ నెస్ ఛాలెంజ్ స్వీకరించిన అక్కినేని నాగార్జున.... కఠినమైన వ్యాయామం చేయడంతో పాటు హీరో నాని, కార్తి, శిల్పారెడ్డికి ఛాలెంజ్ విసిరారు. దీనికి నాని 'చచ్చాను' అంటూ రిప్లై ఇచ్చారు.

  కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కామెడీ నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని సమాచారం. ఈ చిత్రంలో నాని డాక్టర్ పాత్ర పోషిస్తుండగా, నాగార్జున డాన్ పాత్రలో కనిపించనున్నారట.

  ఇంకా టైటిల్ ఖరారుకాని ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి వినాయక చవితి నాటికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

  HumFitToIndiaFit challenge: Nani funny reply to Nagarjuna

  వినాయక చవితి సీజన్లో పెద్ద సినిమాలేవీ విడుదల కావడం లేదు. దీంతో థియేటర్లు ఎక్కువ దొరకడంతో పాటు వినాయక చవితి ఫెస్టివల్ సీజన్ వసూళ్ల పరంగా బాగా కలిసొస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట.

  ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్‌ డి. పట్టి, శ్రీరామ్‌ ఆర్‌. ఇరగం, స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌, కో-డైరెక్టర్‌: తేజ కాకుమాను, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, నిర్మాత: సి.అశ్వనీదత్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.శ్రీరామ్‌ ఆదిత్య.

  English summary
  Nagarjuna Akkineni took up the fitness challenge of accepting his actor son Akhil's challenge. The actor has made a video on his fitness challenge and the same was uploaded on social media sites. Nag also throws fitness challenge to Nani, Karthi and Shilpa Reddy and tweeted that,"Here we go AkhilAkkineni8 my reply for #HumFitToIndiaFit challenge..I challenge NameisNani Karthi_Offl shilpareddy217 to post there fitness videos.My exercise regime today lower body heavy for strength and upper body light for recovery" Nani has given a funny reply by saying "Chachanu".
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more