అసలు అనుష్కను మీట్ కాలేదు...ఆ వార్తల్లో నిజంలేదు...!?
తెలుగు హీరోల అందరి కంటే ఎక్కువ ఎత్తు ఉన్నది ఎవరంటే... దగ్గుబాటి రాణా. జాగర్లమూడి క్రిష్ తన తదుపరి చిత్రం రాణాతో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ చిత్రం పేరు 'కృష్ణం వందే జగద్గురుం'. ఈ చిత్రం షూటింగ్ ఈనెల (డిసెంబర్) 14నుండి ఆరంభంకానుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ సినిమాలో రాణాతో నటించడానికి భామ దొరకడం లేదట. టాలీవుడ్ లో ఎందరో ఉన్నారు దొరకకపోవడం ఏంటని అనుకోకండి. నిజంగానే దొరకడం లేదు.
ఎందుకంటే రాణా ఎత్తుకు సరిపోయే అమ్మాయి అంటే 5.8 అంగుళాలు ఉన్న భామ దొరకడం లేదట. హీరోయిన్ విషయంలో క్రిష్ చాలా పట్టుదలగా ఉన్నాడట. అంతే ఎత్తు ఉండి, నటనలో మంచి ప్రదర్శన చేయగలిగే అమ్మాయి కోసం క్రిష్ చూస్తున్నాడట. మొదట పొడుగుకాళ్ళ సుందరి అనుష్క అని అనుకున్నా ఈమెని తీసుకోవడం లేదని క్రిష్ తేల్చేశాడు. అసలు అనుష్కను ఈ సినిమా కోసం అడగలేదు. దాంతో హీరోయిన్ దొరకకనే షూటింగ్ ప్రారంభించడం లేదని అంటున్నారు.
కొత్త అమ్మాయిని ఈ సినిమా ద్వారా కథానాయికగా పరిచయం చేయాలనే ఆలోచన కూడా ఉంది. త్వరలోనే హీరోయిన్ ని ఫైనలైజ్ చేసేస్తాం' అని చెప్పాడు.


Click it and Unblock the Notifications











