మొగుడే విలనయ్యాడంటున్న మనీషా కొయరాలా
భర్తే శతృవుగా మారితే ఏ స్త్రీ అయినా చేసేదేముంటుంది అంటూ రీసెంట్ గా మాజీ స్టార్ హీరోయిన్ మనీషా కొయరాలా తన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. పెళ్ళైన ఆరు నెలలకే మొగుడు పెళ్ళాల మధ్య విభేదాలు చోటు చేసుకోవటంతో ఆ మధ్య ఆమె ఆ విషయాన్ని రాసి వెంటనే కాస్సేపటికి తీసేసి, ఏదో కోపంలో ట్వీట్ చేసాను అంది. అయితే ఆమె ఇప్పుడు వివాహం పెద్ద సమస్యగా మారిందని, త్వరలో విడాకులు తీసుకోబోతోందని తెలుస్తోంది. అందుకే ఆమె వెంటనే మళ్ళీ తల్లి పాత్రలకు వచ్చి సినిమాలు చేయటం మొదలెట్టింది. ఆమెకు పరిశ్రమలో ఉన్న రిలేషన్సే ఆమె పర్శనల్ లైఫ్ ని నాశనం చేస్తోందంటున్నారు. పెళ్ళికి ముందు గతాన్ని వదిలేసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనని వ్యక్తం చేసిన ఆమె వర్తమానం వదిలేసి తన సిని పరిచయాలతో కాలం గడుపుతూండటంతో తట్టుకోలేని ఆమె సీరియస్ అవ్వటంతో మనీషా సమస్యలో పడింది. ప్రస్తుతం ఆమెను మణిరత్నం ఆయన తీయబోయే రొమాంటిక్ కామిడీలో తీసుకుంటానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తన తరంలో ఉన్న దర్శక, నిర్మాతలు ఇంకా సినిమాలు తీస్తుంటే వారిని కలిసి ఆఫర్స్ సంపాదించే పనిలో ఉంది మనీషా.


Click it and Unblock the Notifications











