రేణు దేశాయ్‌పై ఓ రేంజ్ పుకార్లు.. రియాక్ట్ అయిన పవన్ మాజీ వైఫ్.. ఇదీ మ్యాటర్!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి సంబంధించిన సంగతులు గత కొంతకాలంగా బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె మరో పెళ్ళికి సిద్ధమైందని, నిర్మాతగా సినిమాలు తీస్తూ వెండితెరపై కనిపించేందుకు కూడా రెడీ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ లేటెస్ట్ మూవీ పింక్ రీమేక్‌లో రేణు భాగం కాబోతుందని తెలిసింది. తాజాగా ఈ ఇష్యూపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చేసింది రేణు దేశాయ్‌. వివరాల్లోకి పోతే..

పవన్ రీ ఎంట్రీ.. సగం పనైపోయింది

పవన్ రీ ఎంట్రీ.. సగం పనైపోయింది

'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయ బాట పట్టిన పవన్ కళ్యాణ్.. తిరిగి ముఖానికి రంగేసుకున్నారు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు నడిపిస్తూ ఆ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. బాలీవుడ్ మూవీ 'పింక్' సినిమా తెలుగు రీమేక్ తో పవన్ ఎంట్రీ ఫిక్స్ అయింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా సగానికి చేరుకుంది.

 వకీల్ సాబ్‌‌తో రేణుదేశాయ్.. న్యూస్ వైరల్

వకీల్ సాబ్‌‌తో రేణుదేశాయ్.. న్యూస్ వైరల్

'పింక్' రీమేక్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికి 40 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకున్నట్లు టాక్. ఈ చిత్రానికి 'వకీల్ సాబ్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అయితే ఓ తల్లికి బిడ్డగా నటించాల్సిన పాత్ర ఉంటుందట. ఈ పాత్రలో రేణుదేశాయ్ అయితే బాగుంటుందని ఆమెను ఎంపిక చేశారని వార్తలు వైరల్ అయ్యాయి.

 క్లారిటీగా చెప్పేసిన పవన్ మాజీ వైఫ్..

క్లారిటీగా చెప్పేసిన పవన్ మాజీ వైఫ్..

ఈ కథలో ముగ్గురు అమ్మాయిల పాత్రలు చాలా కీలకంగా ఉంట్టాయి. అందులో ఒక అమ్మాయి పాత్రకు నివేత థామస్, రెండో పాత్రకు అంజలి, అలాగే మూడో పాత్రకు రేణుని ఫైనల్ చేశారని అన్నారు. తాజాగా దీనిపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. అది జస్ట్ ఫాల్స్ న్యూస్ మాత్రమే.. ఎవ్వరూ నమ్మకండి అని తెలిపింది. దీంతో పవన్ సినిమాలో రేణుని చూడాలకున్న వారు నిరాశ చెందుతున్నారు.

దయచేసి అలా చేయకండి.. రేణు రిక్వెస్ట్

దయచేసి అలా చేయకండి.. రేణు రిక్వెస్ట్

ఇదిలా ఉంటే.. తనకు పవన్ కళ్యాణ్ ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కొనిపెట్టారని వార్తలు రాగా వాటిని గట్టిగా తిప్పికొట్టింది రేణు. తను స్వతంత్రంగా తన కాళ్ళ మీద నిలబడుతున్నానని, తన ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయొద్దని తెలుపుతూ సందేశమిచ్చింది. దీంతో అలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది.

లవ్.. కొన్నేళ్లకు బ్రేకప్

లవ్.. కొన్నేళ్లకు బ్రేకప్

అప్పట్లో పవన్ కళ్యాణ్‌ సరసన 'బద్రి' సినిమాలో నటించిన రేణు దేశాయ్.. ఆ తర్వాత అదే పవన్‌ని ప్రేమించి పెళ్లాడింది. కానీ వీళ్ళ కాపురం ఎక్కువకాలం నిలవకపోవడం కారణంగా పవన్ అభిమానులు నిరాశ చెందారు. ఇద్దరు పిల్లలు పుట్టాక వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకొని ఎవరికివారు వేరుగా ఉంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X