ప్రాణాల మీదకు తెచ్చిన KGF 2.. రాఖీభాయ్ దెబ్బకు హాస్పిటల్ కు బాలుడు!

పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' కన్నడ సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది. హీరో యష్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా దెబ్బకు 'కేజీఎఫ్ చాఫ్టర్ 2'ను రూపొందిస్తామని ప్రకటించి ఆ విధంగా రూపొందించి విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో యష్ చేసినట్టు చేయడానికి యత్నించిన ఒక బాలుడు ఆసుపత్రి పాలైన ఘటన చోటు చేసుకుండు a వివరాలోకి వెళితే

 భారీ స్థాయిలో

భారీ స్థాయిలో


యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చాఫ్టర్ 2 సినిమాను హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మాణంలో నిర్మాత విజయ్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో అధీరాగా సంజయ్ దత్ నటించగా సీనియర్ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు 19 ఏళ్ళ ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్ గా వ్యవహరించారు. 'కేజీఎఫ్ చాఫ్టర్ 2'పై ఆరంభం నుంచి భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

 పదే పదే చూడటానికి

పదే పదే చూడటానికి


అయితే ఈ సినిమాకు యశ్‌ హీరోయిజమ్ మెయిన్‌ అట్రాక్షన్‌.. సినిమాలో ఆయన ఎలివేషన్ కే జనాలు పిచ్చెక్కిపోతారు. మరిముఖ్యంగా రాఖీ భాయ్ పాత్రలో యష్ మాట్లాడే మాటలు, ఆటిట్యూడ్‌, సహా నడిచే నడక దాకా అన్నీ ప్రేక్షలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే కేజీఎఫ్ చాఫ్టర్ 2 సినిమాను పదే పదే చూడటానికి యువత ఎక్కువ ఇష్టపడుతున్నారు.

సిగరెట్లు తాగుతున్న సీన్

సిగరెట్లు తాగుతున్న సీన్


అయితే యష్‌ నటించిన కేజీఎఫ్‌-2 సినిమాలోని 'రాఖీభాయ్‌' పాత్రను చూసి తానూ అలాగే స్టైల్‌గా తాయారు అవాలనుకున్న రాజేంద్రనగర్‌ కు చెందిన 15 ఏళ్ల బాలుడు సిగరెట్లు కాల్చి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడు రెండు రోజుల వ్యవధిలో కేజీఎఫ్‌-2 సినిమాను మూడుసార్లు చూశాడట. సినిమాలలో ఒక్కొక్కరికీ ఒక్కో పాయింట్ నచ్చుతుంది కదా, ఆ బాలుడికి యష్ సిగరెట్లు తాగుతున్న సీన్ నచ్చిందట.

సెంచరీ ఆస్పత్రికి

సెంచరీ ఆస్పత్రికి

అంతే ఆయనలా స్టైల్ గా తాగాలని ప్రయత్నిస్తూ ఏకంగా ప్యాకెట్ సిగరెట్లు తాగాడు. ముందు బాగానే ఉన్నా తర్వాత గొంతు మండడం మొదలైంది. దీంతో ముందు చెప్పకూడదు అనుకుంటూనే తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు. సెంచరీ ఆస్పత్రికి తరలించగా ఆ బాలుడికి తాము విజయవంతంగా చికిత్స చేసినట్లు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-12లోని సెంచరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Recommended Video

Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
రాఖీభాయ్‌ స్టైల్‌ చూసి

రాఖీభాయ్‌ స్టైల్‌ చూసి


అంతేకాక సిగరెట్‌ కాల్చడం వల్ల వచ్చే దుష్ప్ర­భావాల నుంచి ఊరట కలిగించడంతో పాటు ఆ బాలుడుకి గట్టిగా కౌన్సింగ్‌ కూడా చేశామని పేర్కొన్నారు. థియేటర్లలో విడుదలైన రెండో వారమే ఆ సినిమా చూసిన బాలుడు అందులో ప్రధాన పాత్ర అయిన రాఖీభాయ్‌ స్టైల్‌ చూసి ప్రేరణ పొందానని.. తాను అలాగే ఉండాలని కోరుకున్నానని అందుకే సిగరెట్లు కూడా కాల్చానని వెల్లడించాడు. ఒటీటీలో వచ్చాక పదే పదే సినిమా చూడడం వలన తాను అలా చేయాలనే కోరిక బలపడిందని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X