twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్, వెంకటేష్, ప్రకాష్ రాజ్ ధర్నా (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్/చెన్నయ్: సినిమా పరిశ్రమపై సర్వీస్ టాక్స్ విధించడాన్ని నిరసిస్తూ దక్షిణాది సినిమా పరిశ్రమలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు తమ నిరసన వ్యక్తం చేయడానికి హైదరాబాద్, చెన్నయ్‌లలో తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల ప్రముఖులు ఒక రోజు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు.

    సర్వీస్ టాక్స్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమానికి ఫిల్మ్ ఛాబర్ అధ్యకుడు తమ్మారెడ్డి భరద్వాజ, 'మా' అధ్యక్షుడు మురళీ మోహన్ నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో డి రామానాయుడు, కైకాల సత్యనారాయణ, వెంకటేష్, సునీల్, అల్లు అరవింద్, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు.

    అదే విధంగా తమిళనాడులో నటుడు శరత్ కుమార్ నేతృత్వంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్, రాధిక, ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ టాక్స్ నుంచి చిత్ర పరిశ్రమను మినహాయించాలని, సర్వీస్ టాక్స్ రద్దు చేసే విధంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేసారు.

    రజనీకాంత్, వెంకటేష్, ప్రకాష్ రాజ్ @ ధర్నా (ఫోటోలు)

    చెన్నైలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నా రజనీకాంత్, శరత్ కుమార్.

    రజనీకాంత్, వెంకటేష్, ప్రకాష్ రాజ్ @ ధర్నా (ఫోటోలు)

    హైదరాబాద్ లో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న హీరో వెంకటేష్, ఇతర సినీ ప్రముఖులు.

    రజనీకాంత్, వెంకటేష్, ప్రకాష్ రాజ్ @ ధర్నా (ఫోటోలు)

    చెన్నైలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్, రాధిక తదితరులు.

    English summary
    Superstar Rajinikanth, Venkatesh, Prakash Raj joined the protest against service tax levied by the Centre on the Tamil and Telugu film industry. The stars, technicians and other officials of the industry were on a day-long hunger strike in Chennai and Hyderabad on Monday, Jan 7. The protesters demanded to scrap the tax.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X