RGV: ఆర్జీవీకి షాకిచ్చిన కోర్టు... వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ వేస్తూ కీలక ఆదేశాలు?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే. ఇక ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం వ్యూహం. ఇక ఈ సినిమా ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. వ్యూహం సినిమాను ఆపాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు వ్యూహం సినిమాకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ కొనసాగుతోంది. ఈ సినిమాను ఆపాలంటూ... కోర్టులో పిటిషన్లు, ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీ వ్యూహం మూవీపై సెన్సార్‌ కమిటీ సైతం అభ్యంతరం వ్యక్తం చేయగా... ఈ విషయంపై బెంగళూరులోని రివైజ్ కమిటీకి సిఫార్సు చేసింది. బెంగళూరులో వ్యూహాం మూవీకి క్లీన్ యూ సర్టిఫికెట్‌ ఇచ్చారు సెన్సార్ బోర్డు సభ్యులు.

Recommended Video

RGV Vs Kolikapudi వివాదంలోకి Pawan Kalyan ని ఎందుకు లాగుతున్నారు? | Telugu Filmibeat

Hyderabad City Civil Court Break to Ram Gopal Varma Vyooham OTT, Online Version Full Details Here

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఆఫీస్‌ ఎదుట ఆందోళన చోటుచేసుకుంది. చంద్రబాబు ఫ్యామిలీ టార్గెట్‌ గా ఆర్జీవీ సినిమాలు తీస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు టీడీపీ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలపై హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలుస్తోంది.

వ్యూహం చిత్రాన్ని ఓటీటీ, ఆన్‌లైన్‌, ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందట. ఈ మేరకు రామదూత క్రియోషన్స్‌, దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు నోటీసులు కూడా పంపించిందని సమాచారం. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Hyderabad City Civil Court Break to Ram Gopal Varma Vyooham OTT, Online Version Full Details Here

వ్యూహం సినిమా విడుదల ఆపాలంటూ... టీడీపీ నేతలు హైదరాబాద్‌ సిటీసివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు టీడీపీ నేతలు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్, దర్శకుడు రాంగోపాల్‌ వర్మలను పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు.

చిత్రం విడుదల కాకుండా నిర్మాతను ఆదేశించాలని న్యాయస్థానానికి టీడీపీ నేతలు విన్నవించారు. ఈ సినిమా వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం దెబ్బతింటోందని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఈనెల 29న రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతుండగా... కోర్టు దీనిపై తీర్పు వెలువరించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X