Don't Miss!
- News
సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడమూ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తప్పే: టైమ్ వేస్ట్ అట..!!
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Lifestyle
హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Finance
Q3 Results: అదరగొట్టిన L&T.. మిస్ కొట్టిన టెక్ మహీంద్రా.. గెయిల్ కు ఎదురుదెబ్బ..
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
హీరోయిన్ కీర్తి సురేష్ కనబడుటలేదు.. హీరో ఫిర్యాదు.. స్పందించిన హైదరాబాద్ పోలీసులు
నితిన్, కీర్తి సురేష్‌లు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పగలు తీర్చుకునే పనిలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య గొడవలు ఎలా మొదలయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ మధ్య షూటింగ్ గ్యాప్‌లో కీర్తి సురేష్ ఓ కునుకు తీసింది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసి కీర్తి సురేష్ పరువుతీశాడు నితిన్. ఈ విషయంలో దర్శకుడు వెంకీ అట్లూరి హస్తం కూడా ఉందని కీర్తి సురేష్ తెలుసుకుంది. ఎప్పటికైనా సరే పగ తీర్చుకుంటానని అప్పుడే కీర్తి సురేష్ చెప్పింది.

మధ్యలో అలా..
కీర్తి సురేష్ చెప్పినట్టుగానే డైరెక్టర్ వెంకీ అట్లూరి మీద పగ తీర్చుకుంది. దుబాయ్ షెడ్యూల్‌లోనే సెట్‌లో దర్శకుడిని పరిగెత్తించి పరిగెత్తించి మరీ కొట్టింది. గొడుగుతో పొడిచేందుకు ప్రయత్నించింది. ఇక నితిన్ నీ వంతే మిగిలింది అంటూ కీర్తి సురేష్ వార్నింగ్ కూడా ఇచ్చింది.

తాజాగా అలా..
అయితే నితిన్ మీద పగ తీర్చుకునేందుకు బాగానే సమయం తీసుకుంది కీర్తి సురేష్. ఓ స్పెషల్ యాప్‌లో నితిన్ ఫోటోను మార్పింగ్ చేసిన పాట పాడుతూ డ్యాన్స్ చేసినట్టుగా చూపించింది. ఇక దీనిపై స్పందించిన నితిన్.. నీ సంగతి చెబుతా అన్నట్టుగా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

ట్రైలర్‌తో రచ్చ..
నితిన్ కీర్తి సురేష్ ఇలా ఎందుకు ఒకరి మీద ఒకరు కారాలు మిర్యాలు నూరుతున్నారో ట్రైలర్‌ను చూస్తే అర్థమైంది. అర్జున్ అను అనే పాత్రల్లోనే వీరు ఇంకా ఉన్నారని, అందుకే ఇలా టాం అండ్ జెర్రీలా ఫైటింగ్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా నితిన్ షేర్ చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

నితిన్ అలా..
తప్పిపోయింది.. కనబడుట లేదు.. డియర్ అను.. నువ్వు ఎక్కడున్నా రంగ్ దే ప్రమోషన్స్‌లో జాయిన్ అవ్వాలని మా కోరిక.. ఇట్లు నీ అర్జున్ అని కీర్తీ సురేష్ చిన్న నాటి ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో కీర్తి సురేష్ మరీ వింతగా ఉండటంతో తెగ వైరల్ అవుతోంది.

స్పందించిన పోలీసులు..
నితిన్ చేసిన ఈ పోస్ట్‌పై హైద్రాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. అసలే ఈ మధ్య మీమ్స్, ట్రోలింగ్స్, కౌంటర్లు ఇవ్వడంలో తెలంగాణ పోలీసులు రాటు దేలారు. నితిన్ చేసిన మిస్సింగ్ పోస్ట్‌పై సిటీ పోలీసులు స్పందిస్తూ.. నితిన్ నువ్వేమీ బాధపడకు.. మీ వెతికి తీసుకొస్తాం.. జాగ్రత్తగా చూసుకుంటాం అని పోస్ట్ చేశారు.