twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుట్టిన రోజు నాడే వర్మకు నిర్మాత షాక్.. 'మా ఇష్టం' రిలీజ్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు..

    |

    ఒకప్పుడు తెలుగు సినిమాకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కేవలం వివాదాలు అవుతాయి అనుకున్న సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అందులో భాగంగానే ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో 'మా ఇష్టం' డేంజరస్ అనే సినిమా తెరకెక్కించారు. అయితే రాంగోపాల్ వర్మ పుట్టిన రోజు నాడే ఈ సినిమా విషయంలో ఆయనకు షాక్ తగిలింది. ఆ వివరాల్లోకి వెళితే

    విపరీతమైన ఆసక్తి ఉండేది

    విపరీతమైన ఆసక్తి ఉండేది

    ఎవడు ఎలా పోతే నాకేంటి అంతా నా ఇష్టం అంటూ అటు సమాజంతో కానీ సమాజంలో వ్యక్తులతో కానీ ఏమాత్రం సంబంధం లేకుండా తనకు నచ్చిన విధంగా బతుకుతూ, నచ్చింది మాట్లాడుతూ వ్యవహరించే వ్యక్తి రాంగోపాల్ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు అందరిలోనూ విపరీతమైన ఆసక్తి ఉండేది కానీ రాను రాను ఆయన సినిమాలు చూసి జనం పెదవి విరవడం మొదలుపెట్టారు.

    లెస్బియన్ స్టొరీ

    లెస్బియన్ స్టొరీ

    అయితే ప్రేక్షకులు చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి నాకు నచ్చిన సినిమా తీస్తా అంటూ ఆయన ఎప్పటికప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాస్పద సినిమాలు, బయోపిక్ సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్న ఆయన కాస్త రూటు మార్చి ఇద్దరు ఆడవాళ్ళు ప్రేమించుకుంటే ఏమౌతుంది? అంటూ ఒక లెస్బియన్ స్టొరీ సిద్ధం చేశారు.

    పాన్ ఇండియా రేంజ్ లో

    పాన్ ఇండియా రేంజ్ లో

    తనతో పాటు కొన్ని సినిమాలు చేసినా అప్సర రాణిని, నైనా గంగూలిని ఇద్దరినీ హీరోయిన్లుగా పెట్టుకొని డేంజరస్ అనే సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది నిజానికి వర్మ సొంతంగా ప్రమోట్ చేసిన స్పార్క్ ఓటీటీ ద్వారా సినిమా విడుదల చేయాలని అనుకున్నారు కానీ థియేటర్లన్నీ మళ్ళీ లైన్లోకి రావడంతో సినిమా ను అన్ని భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

    థియేటర్లు అభ్యంతరం

    థియేటర్లు అభ్యంతరం

    ఒక్కో భాషలో ఒక్కో పేరుతో విడుదల అవుతున్న ఈ సినిమాలో ఇంగ్లీషులో డేంజరస్ అని తెలుగులో మా ఇష్టం అని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 8న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో తన మూవీని ప్రదర్శించేందుకు పీవీఆర్‌, ఐనాక్స్‌ థియేటర్లు అభ్యంతరం వ్యకం చేశాయి. డేంజరస్‌ చిత్రాన్ని తమ థియేటర్లో ప్రదర్శించబోమంటూ వర్మకు షాకిచ్చాయి. ఈ విషయాన్ని స్యయంగా ఆర్జీవీ సోషల్‌ మీడియా వేదిక వెల్లడించాడు కూడా.

    Recommended Video

    I Think The Sensor People Also Like Le$ibi@n$ - RGV | Filmibeat Telugu
    వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నా అంటూ

    వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నా అంటూ

    ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. పీవీఆర్‌, ఐనాక్స్‌ డెంజరస్‌ సినిమాను ప్రదర్శించడానికి నిరాకరించినట్లు తెలిపాడు. అంతేకాదు ఈ మూవీ పట్ల వారు వ్యవహరించిన తీరు సుప్రీం కోర్టు తీర్పు వ్యతిరేకించేలా ఉందన్నాడు. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. అంటే పీవీఆర్‌, ఐనాక్స్ యాజమాన్యాలు ఎల్‌జీబీటీని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ కమ్యూనిటీ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నా' అంటూ వర్మ రాసుకొచ్చాడు.

    సినిమా రిలీజ్ ను ఆపాలని

    సినిమా రిలీజ్ ను ఆపాలని

    ఇక అది మరువక ముందే రామ్ గోపాల్ వర్మ కు సిటీ సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది. తనకు డబ్బులు ఇవ్వాల్సిన ఆర్జీవీ ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడని కోర్టులో నిర్మాత నట్టి కుమార్ పిటిషన్ వేశాడు. తనకు ఆర్జీవీ 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని,దాని కోసం ప్రతి సినిమాకు 50 లక్షలు ఇవ్వాలని నిబంధనలను తుంగలో తొక్కి ఆర్జీవీ ఈ సినిమా విడుదలకు సిద్ధం అయ్యాడని ఆరోపిస్తున్నారు నట్టి కుమార్. ఇక ఈ పిటిషన్ ను విచారించిన సిటీ సివిల్ కోర్టు ఆర్జీవీ తీసిన మా ఇష్టం సినిమా రిలీజ్ ను ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.

    English summary
    Hyderabad city civil court gives stay on RGV's Maa ishtam on behalf of natti kumar's petetion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X