RGV: వ్యూహం మూవీ విడుదలకు కోర్టు బ్రేక్? రాంగోపాల్ వర్మకు అలా షాకిచ్చిన లోకేష్!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనలంటూ భావిస్తూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం వ్యూహం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం బ్యాక్ డ్రాప్‌గా రూపొందించిన ఈ సినిమా రిలీజ్‌కు రకరకాల సమస్యలు అడ్డుపడుతున్నాయి. ఇటీవల సెన్సార్ అడ్డంకులను ఎదురించిన రిలీజ్‌కు సిద్దమైన ఈ సినిమాకు మరో లీగల్ పరంగా వచ్చిన ఓ సమస్య వివరాల్లోకి వెళితే..
Recommended Video

ఆర్జీవి డెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్ అధినేత దాసరి కిరణ్ కుమార్ వ్యూహం సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వైఎస్ జగన్‌గా అజ్మల్ వైఎస్ భారతీ పాత్రలో మానస నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సుజీష్ రాజేంద్రన్, ఎడిటర్‌గా మనీష్ ఠాకూర్ వ్యవహరిస్తున్నారు.

వ్యూహం సినిమాను రెండు భాగాలుగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని వ్యూహం, రెండో భాగాన్ని శపథం పేరుతో రిలీజ్ చేయడానికి ప్లాన్ సిద్దం చేశారు.ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను 29వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఆర్జీవి ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా ఇటీవల వెల్లడించాడు. అయితే ఈ డేట్‌కు సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అనే సందేహంగా మారింది.
వ్యూహం సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయనే కారణంతో సెన్సార్ బోర్డు అధికారులు సర్టిఫికెట్‌ను నిరాకరించారు. ఆ సినిమాను సెన్సార్ బోర్డు రివిజన్ కమిటికి సిఫారసు చేశారు.దాంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇలాంటి అడ్డంకును ఎదుర్కొని రిలీజ్‌కు సిద్దమైన చిత్రానికి మరో సమస్య ఎదురైంది.
వ్యూహం సినిమా విడుదల నిలిపి వేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో టీడీపీ అధినేత లోకేష్ పిటిషన్ వేయగా, కోర్టు విచారణకు అనుమతించింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ పిటిషన్‌పై డిసెంబర్ 27వ తేదీన విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు.
వ్యూహం సినిమాను ఓటీటీ, ఏ ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేయకుండా కూడా సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఈ సినిమాను డిజిటల్‌గా రిలీజ్ చేయాలనే ప్రయత్నాలకు కూడా అడ్డుకట్ట పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అలాగే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ డిసెంబర్ 26వ తేదీన విచారణకు రానున్నది.


Click it and Unblock the Notifications











