twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెల్లువెత్తుతున్న విరాళాలు.. వెయ్యి కిలోల బియ్యం సరఫరా.. కదులుతున్న తారలు!!

    |

    గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అందరికీ తెలిసిందే. ఎడతెరపి కురుస్తున్న వానలతో హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. భాగ్య నగారాన్ని వర్షం బీభత్సంగా ముంచేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలు, ఇళ్లు కూడా వరదలతో నిండిపోయాయి. ఈ క్రమంలో తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. హైద్రాబాద్‌ను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 550 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది.

    Recommended Video

    #HyderabadFloods:Tollywood Heros Donations,హైదరాబాద్‌ కోసం ముందుకొచ్చిన టాలీవుడ్..భారీగా విరాళాలు!!
    కదిలిన టాలీవుడ్..

    కదిలిన టాలీవుడ్..

    ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా నిలబడేందుకు నందమూరి బాలకృష్ణ అందరికీ ముందుగా స్పందించాడు. కోటిన్నర విరాళాన్ని ప్రకటించాడు. అంతేకాకుండా భోజన సదుపాయాలు, ఇతరు అవసరాలను కూడా తీర్చేందుకు ముందుకు వచ్చాడు. ఇక నేడు టాలీవుడ్ తారలంతా కదిలి వచ్చారు.

    విరాళాల వెల్లువ..

    విరాళాల వెల్లువ..

    చిరంజీవి, మహేష్ బాబు కోటి చొప్పున, నాగార్జున ఎన్టీఆర్ యాభై లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. విజయ్ దేవరకొండ 10 లక్షలు, అనిల్ రావిపూడి 5 లక్షలు, హరీష్ శంకర్ 5 లక్షలు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, త్రివిక్రమ్ పది లక్షలు విరాళంగా ప్రకటించారు.

    స్పందించిన రామ్..

    స్పందించిన రామ్..

    నా తెలంగాణ ప్రజల పట్ల నాకెప్పుడూ బాధ్యత ఉంటుంది.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ మొదటి రోజు నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటోన్న కేటీఆర్‌ను చూస్తే ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వానికి నా వంతు సాయం చేయాలనుకుంటున్నాను.. అందుకే 25 లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నాను అని రామ్ ప్రకటించాడు.

    బండ్ల గణేష్ సైతం..

    బండ్ల గణేష్ సైతం..

    బండ్ల గణేష్ సైతం ప్రభుత్వం స్పందిస్తోన్న తీరు, వరద బాధితులను ఆదుకుంటోన్న విషయంపై స్పందిస్తూ తాను కూడా తన వంతుగా ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించాడు. ఈ మేరకు ఐదు లక్షలు విరాళంగా ఇస్తున్నానని తెలిపాడు. ఇక డబ్బులు మాత్రమే ఇవ్వడం కాకుండా కొందరు నిత్యావసర సరుకులను కూడా అందిస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు.

    మహేష్ ఎస్ కోనేరు అలా..

    మహేష్ ఎస్ కోనేరు అలా..

    ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహష్ ఎస్ కోనేరు తన గొప్ప మనసును చాటుకున్నాడు. హైద్రాబాద్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు స్ఫూర్తి సంస్థ ద్వారా వెయ్యి కిలోల బియ్యం, ఐదు వందల దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించాడు. మన హైదరాబాదీలకు సాయం మనమంతా నిల్చుందాం.. చేతనైన సాయాన్ని చేద్దామని మహేష్ ఎస్ కోనేరు పిలుపునిచ్చాడు.

    English summary
    Chiranjeevi And Mahesh Babu Donates one crore tO CMRF For Hyderabad Rains, The unprecedented rains in Hyd have caused massive devastation,loss of lives & extreme hardship to thousands. My heart goes out to those affected by nature's fury.I'm humbly donating Rs.1Cr to CM Relief Fund.Also appeal 2 all who can to come frward & help the needy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X