twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పబ్ కేసు.. ఎప్పటి నుంచో కొనసాగుతున్న వ్యవహారం... ఇప్పుడే ఎందుకు బయటపడిందంటే?

    |

    హైదరాబాద్ లో చాలా రోజుల తర్వాత డ్రగ్స్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. అందులో సినిమా తారలు కూడా ఉన్నట్లుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ లో ఒక ప్రముఖ పబ్ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు ఆకస్మాత్తుగా దాడులు నిర్వహించడంతో అక్కడ డ్రగ్స్ కూడా వాడుతున్నట్లు మరొక కోణం బయటపడింది. అయితే ఈ వ్యవహారం ఇప్పటిది కాదు అని టాక్ కూడా వినిపిస్తోంది. చాలా రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా సమయానికి మించి నడుపుతున్నట్లు గా తెలుస్తోంది. అసలు ఇప్పుడు ఈ వ్యవహారం ఎందుకు భయపడింది అనే విషయంలో మరో కొత్త టాక్ వినిపిస్తోంది.

    రూల్స్ పాటించకుండా..

    రూల్స్ పాటించకుండా..

    బంజారాహిల్స్​ లోని ప్రముఖ ర్యాడిసన్ బ్లూ హోటల్ లో
    ఫుడింగ్ మింగ్ పబ్ ను నిబంధనలకు విరుద్ధంగా సమయానికి మించి కొనసాగిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందగానే వెళ్లి తనిఖీలు నిర్వహించారు. 12 గంటల తర్వాత ఏ మాత్రం పబ్ ను కొనసాగించ వద్దు అని రూల్ ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం అవేవీ పట్టించుకోకుండా యధావిధిగా ముందుకు సాగుతున్నట్లుగా గుర్తించారు.

    కొత్తేమి కాదు..

    కొత్తేమి కాదు..

    అయితే ఆ పబ్ సమయానికి మించి కొనసాగడం కొత్తేమీ కాదని ఇది వరకే చాలాసార్లు లో తెల్లవారు జామున కూడా పబ్ ను కొనసాగించినట్లు గా స్థానికులు చెబుతున్నారు. ఇదివరకే కొన్నిసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చినప్పటికీ కూడా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు అని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఉన్నతాధికారులు ఆ పరిధిలో ఉండే పోలీసులను కూడా ఈ విషయంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

     హఠాత్తుగా దాడులు.. ఎందుకంటే?

    హఠాత్తుగా దాడులు.. ఎందుకంటే?

    ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించాల్సి వచ్చింది అనే ప్రశ్న ఎదురవుతోంది. అయితే హోటల్ యాజమాన్యం తీరుపై స్థానికులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసి చర్యలు తీసుకోవాలి అని డైరెక్ట్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. డ్రగ్స్ కూడా వాడుతున్నారు అని తెలియగానే టాస్క్ ఫోర్స్ అధికారులు ముందుగానే అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది.

    ఎంట్రీ కోసం స్పెషల్ పాసులు

    ఎంట్రీ కోసం స్పెషల్ పాసులు

    అయితే ఆ పబ్ కు వెళ్లాలి అంటే అంత సులువు కాదు అని తెలుస్తోంది. ఎంట్రీ కోసం ప్రత్యేకంగా పాసులు కూడా రెడీ చేస్తారని తెలుస్తోంది. ఇలాంటి పార్టీలు కూడా రెగ్యులర్ జరగకుండా ఎప్పుడైనా స్పెషల్ వీకెండ్స్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సంప్రదించిన వారిలో నమ్మకంగా తెలిసిన వారికి పాస్ లు ఇస్తున్నట్లు సమాచారం. బయట వారు రాకుండా వీలైనంత వరకు సెలబ్రెటీలకు మాత్రమే పాస్ లు ఇచ్చినట్లు సమాచారం.

    Recommended Video

    RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
    కేసులో స్టార్ సెలబ్రెటీలు?

    కేసులో స్టార్ సెలబ్రెటీలు?

    ఇక పబ్ లో ఉన్న దాదాపు 150 మందిని అరెస్ట్ చేసిన అధికారులు వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపేసినట్లు తెలుస్తోంది. ఇక డ్రగ్స్ వాడినట్లు పలు అనుమానాలు వస్తున్న తరుణంలో ఆ కోణంలో ప్రత్యేకంగా విచారణలు కొనసాగే అవకాశం ఉంది. ఇక సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కొణిదెల..ఇలా కొంతమంది సెలబ్రెటీలు కూడా అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. ఇక నిహరికకు ఎలాంటి తప్పు లేదని నాగబాబు క్లారీటి ఇవ్వగా తను కేవలం పార్టీకి మాత్రమే వెళ్ళాను అని రాహుల్ తెలియజేశాడు.

    English summary
    Hyderabad Mink Pub of Radisson Blu Hotel case complaint behind the reason
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X