Betting APP Scam: బెట్టింగ్ యాప్ స్కామ్‌లో యాంకర్ శ్యామల.. విష్ణుప్రియ, రీతూ చౌదరీ, సుప్రీతపై కేసు నమోదు

ఐపీఎల్, ఇతర ప్రధాన ఈవెంట్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ, ఆంధ్రా పోలీసులు కొరడాలు ఝళిపిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కొందరు సెలబ్రిటీలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇంకా పలు సినీ తారలు, టెలివిజన్ యాక్టర్లపై కేసులు నమోదు చేయడం తెలుగు సినిమా ప్రపంచంలో సంచలనంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసిన లిస్టు తయారు చేసి వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

గత కొద్ది రోజుల క్రితం బెట్టింగ్‌కు పాల్పడుతూ వాటిని ప్రమోట్ చేస్తున్న లోకల్ నానిని విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లను విచారించి అదుపులోకి తీసుకొంటున్నారు. మరికొందరిని నేరుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Hyderabad Police files case on Anchor Shyamala

ఇదిలా ఉండగా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారనే విషయం బయటకు రాగానే.. రీతూ చౌదరీ, సుప్రితీ, విష్ణు ప్రియ, యాంకర్ శ్యామల లాంటి కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలోకి వచ్చి.. తాము ప్రమోషన్స్ చేయడం తప్పే. నేను తప్పు చేశాను. మీరు అలాంటి తప్పు చేయవద్దు. ఎవరూ కూడా అలాంటి బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. ఎవరి వద్దనైనా బెట్టింగ్ యాప్స్ ఉంటే వాటిని డిలీట్ చేయండి అంటూ సందేశాలు ఇవ్వడం ప్రారంభించారు.

Take a Poll

ఈ క్రమంలో హైదరాబాద్‌లో పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్లర్లపై కేసు నమోదు చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు సుమారుగా 11 మంది యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. కేసులు నమోదు చేసిన వారిలో బిగ్ బాస్ సెలబ్రిటీ విష్ణు ప్రియ, సురేఖవాణి కూతురు సుప్రీత, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, హర్ష సాయి, రీతు చౌదరి, సన్నీ యాదవ్,టేస్టీ తేజ, యాంకర్ శ్యామలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గత రెండు రోజులుగా బెట్టింగ్ యాప్స్ వినియోగించడం, ప్రమోట్ చేయడంపై బహిరంగ క్షమాపణలు కోరినా కొందరి సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో అడ్డంగా దొరికిన వైసీపీ నేత, యాంకర్ శ్యామల పేరు కూడా ఈ కేసు నమోదులో ఉండటం మరింత చర్చనీయాంశమైంది. ఈ విషయంలో శ్యామల ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X