Baby టీమ్‌కి కొత్త షాక్... డ్రగ్స్ కేసులో నోటిసులు... దర్శకుడు సాయిరాజేష్ ఏమన్నాడంటే?
చిన్న సినిమాగా రిలీజ్ అయి.. సంచలనం సృష్టించిన సినిమా బేబీ. ఇక ఈ చిత్రం ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఈ చిత్రంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్... ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన సీపీ బేబీ సినిమాలో డ్రగ్స్ ను ప్రోత్సహించేలా చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. ఇక సీపీ కామెంట్స్ పై దర్శకుడు సాయి రాజేష్ కూడా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే....
దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలుగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టి.. ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా బేబీ చిత్రంలో సీన్లు ఉన్నాయని సీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ను ఏ విధంగా ఉపయోగించాలనే దృశ్యాలను చూపించారని వెల్లడించారు. మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్ లో హైదరాబాద్ పోలీసులు నార్కోటిక్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఇక ఈ సమయంలో సన్నివేశాలు 'బేబి' సినిమాలో ఉన్నాయని సీపీ ఆనంద్ చెప్పారు.
సీపీ ఆనంద్ మాట్లాడుతూ... బేబీ చిత్రం చూసి నిందితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారు. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు కనీసం హెచ్చరిక వేయలేదు. మళ్లీ మేము హెచ్చరిస్తే హెచ్చరిక లైన్ వేశఆరు. ఇప్పుడు బేబీ సినిమా ప్రొడ్యూసర్ కి నోటిసులు ఇస్తాం. ఇకపై అన్ని సినిమాలపై ఫోకస్ పెడతాము. ఇలాంటి సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదన్నారు.. బేబీ సినిమా అభ్యంతరకర సన్నివేశాలు ప్లే చేసి వివరించారు.
ఇక సీపీ కామెంట్స్ పై దర్శకుడు సాయి రాజేష్ స్పందించారు. బేబీ టీమ్ కు సీపీ కార్యాలయం నుంచి కాల్ వచ్చిందని వెల్లడించారు. బేబీ సినిమాలో డ్రగ్ యూసేజ్ పై క్లారిటీ గురించి నోటీసులు ఇచ్చారన్నారు. సినిమా బీట్ లో డ్రగ్స్ వాడుతున్నాట్లు ఉందన్న ఆయన.. ఇలాంటి సన్నివేశాలు వాడేటప్పుడు బ్లార్ చేయాలని వాడొద్దని సూచించారన్నారు.

ఇక సాయి రాజేష్ చెప్పిన దాని ప్రకారం... సెన్సార్ లో సీన్స్ ఇప్పుడు కట్ చేయలేము. డ్రగ్ బారిన యువత పడొద్దు. డ్రగ్స్ వలలో పడితే బయటికి రావడం కష్టం. మా టీమ్ పై బాధ్యత ఉంది. బెస్ట్ ఫ్రెండ్, బ్యాడ్ ఫ్రెండ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే బేబీ సినిమాలో ఆ సన్నివేశం తీశాం. అంతే తప్ప డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా మేము సినిమా తీయలేదు. నా తోటి డైరెక్టర్ లకు విన్నపం. డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా సన్నివేశాలు తీయొద్దంటూ.. చెప్పుకువచ్చారు.


Click it and Unblock the Notifications











