twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుట్టిన రోజే షాక్.. ఎన్టీఆర్ నివాసం వద్ద తీవ్ర అలజడి.. ఫ్యాన్స్ మీద పోలీసుల లాఠీ ఛార్జ్?

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ మే 20వ తేదీన తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి.. ఇదిలా ఉంటే పుట్టిన రోజు నాడే ఎన్టీఆర్ అభిమానులు లాఠీఛార్జి ద్వారా గాయపడడం ఇప్పుడు అభిమానులందరినీ బాధపడుతోంది. అదేమిటి ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు లాఠీచార్జి ఎందుకు జరిగింది? అసలు ఏమైంది? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

    నిన్ను చూడాలని సినిమాతో

    నిన్ను చూడాలని సినిమాతో


    తండ్రి హరికృష్ణ నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ పూర్తిగా నూనుగు మీసాల వయసు రాకముందే బాల రామాయణం అనే సినిమాలో రాముడి పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో అద్భుతమైన నటనకు గాను ఎన్టీఆర్ కు మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఆ తర్వాత హీరోగా మారిన ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

    భారీ కలెక్షన్లు

    భారీ కలెక్షన్లు


    ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఆయనను మంచి మాస్ హీరోగా నిలబెట్టింది. ఇక అలా వరుస సినిమాలు చేస్తూ వెళ్లిన ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా నిలిచాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాలో మెరిసిన ఆయన తన కెరీర్ లోనే అత్యంత భారీ కలెక్షన్లు సాధించాడు.

    ఇంట్లో లేకపోవడంతో

    ఇంట్లో లేకపోవడంతో


    ఆ సంగతి అలా ఉంచితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. సరిగ్గా మే 19వ తేదీ రాత్రి నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అక్కడే వేచి చూసిన అభిమానులు ఎన్టీఆర్ బయటకు వచ్చి తమకు అభివాదం చేస్తాడు అని భావించారు. కానీ ఎన్టీఆర్ ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో వారి ఆశలు అడియాశలు అయ్యాయి.

    ఆగి ఉంటే బాగుండేది

    ఆగి ఉంటే బాగుండేది


    అయితే ఎన్టీఆర్ ఎప్పటికైనా రాకపోతారా అని అక్కడ ఎదురు చూసిన అభిమానులు తమతో పాటు తెచ్చిన కేక్ ను అక్కడే కూడా కటింగ్ చేశారు. అక్కడితో ఆగి ఉంటే బాగుండేది కానీ కాస్త హడావిడి చేయడం మొదలుపెట్టారు. మామూలుగా ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో నివాసం ఉండే ప్రాంతంలోనే మరింత మంది ప్రముఖులు కూడా నివసిస్తున్నారు. అయితే వారు తమ ఇళ్లకు కూడా వెళ్లేందుకు లేకుండా అభిమానులు అందరూ రోడ్డు బ్లాక్ చేయడమే కాక తప్పుకోమంటే తప్పుకోకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

    లాఠీలకు పని

    లాఠీలకు పని


    అభిమానులు పోలీసులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. పోలీసుల ముందే హడావిడి చేస్తూ టపాసులు కాలుస్తూ రచ్చ చేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు చాలా మర్యాదగా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరారు. అయితే అభిమానులు ఖాళీ చేసి వెళ్లిపోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేకపోవడమే కాక పోలీసుల మీద రుబాబు చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు.

    కౌన్సిలింగ్ ఇచ్చి

    కౌన్సిలింగ్ ఇచ్చి


    దీంతో ఎక్కడికక్కడ ఎన్టీఆర్ అభిమానులు చెల్లాచెదురు అయిపోయి వెళ్లిపోయారు అయితే కాస్త హడావిడి చేసిన వారిలో కొంత మందిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడు వారిని విడిచిపెట్టారు విశ్వనీయ వర్గాల సమాచారం.

    English summary
    Hyderabad Police Lathi Charge On Jr NTR Fans at NTRs House.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X