ఉదయ్ కిరణ్ కాల్ డేటా: 4 కాల్స్, భార్య విషితకు నో..మెసేజ్
హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడ్డ సినీ నటుడు ఉదయ్ కిరణ్ కేసును వేగవంతంగా విచారిస్తున్నారు పోలీసులు. ఆయన్ను ఆత్మహత్యకు ప్రేరేపించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయ్ కిరణ్, అతని భార్య విషిత కాల్ డేటాను తెప్పించుకున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన ఫోన్ నుంచి మొత్తం 4 కాల్స్ బయటకు వెళ్లాయి. అందులో రెండు కాల్స్ అతని ప్రాణ మిత్రుడు శరత్‌కు, రెండు కాల్స్ భార్య విషితకు వెళ్లాయి. రాత్రి 10.30 గంటల తన ఫోన్ చెడిపోయిందని విషిత్ ఉదయ్ కిరణ్‌కు మెసేజ్ పెట్టింది.
ఆత్మహత్య చేసుకునే ముందు ఉదయ్ కిరణ్ తన భార్యకు ఐలవ్యూ అని మెసేజ్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఉదయ్ కిరణ్ సెల్ ఫోన్ నుండి భార్య విషితకు ఎలాంటి మెసేజ్ వెళ్లలేదని పోలీసులు అంటున్నారు. ఈ విషయమై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఆత్మహత్య చేసుకున్న సినీ నటుడు ఉదయ్ కిరణ్ మృత దేహానికి ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసి పోరెన్సిక్ రిపోర్టు తయారు చేసారు. ఫోరెన్సిక్ రిపోర్టులో పలు షాకింగ్ విషయాలు బయట పెట్టారు వైద్యులు. గతంలో రెండు సారి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు వైద్యులు గుర్తించారు.
అతని ఎడమచేతి మణికట్టుపై బ్లేడుతో కోసుకున్నట్లు పాత గుర్తులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆదివారం రాత్రి 10.30 నుంచి 11 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నారు. ఫోరెన్సిక నివేదిక ఇంకా పోలీసులకు సమర్పించలేదని ఉస్మానియా ఫోరెన్సిక్ డాక్టర్ అమ్మాణీ తెలిపారు.


Click it and Unblock the Notifications











