twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజశేఖర్ కారు ప్రమాదంపై పోలీసుల రియాక్షన్.. షాకింగ్ కారణాలు

    |

    హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తు రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఈ ప్రమాదంపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు.

    రాజశేఖర్ కారు ప్రమాదంపై పోలీసులు

    రాజశేఖర్ కారు ప్రమాదంపై పోలీసులు

    రాజశేఖర్ కారు ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదంపై కేసు నమోదు చేశామని, పూర్తి విచారణ జరిపాక తదుపరి సమాచారం అందజేస్తామని అన్నారు పోలీసులు.

    Recommended Video

    Hero Rajasekhar Met With A Car Mishap || హీరో రాజశేఖర్‌ కారు బోల్తా! ||
    బెంజ్ కారు.. ప్రమాదం జరిగిన సమయంలో

    బెంజ్ కారు.. ప్రమాదం జరిగిన సమయంలో

    ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు రోడ్డు ప్రమాదానికి గురైందని, పెద్ద గోల్కొండ టోల్ గేట్ వద్ద ఈ సంఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. TS 07FZ 1234 నెంబర్ గల బెంజ్ కారులో రాజశేఖర్ ప్రయాణించారని, ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారని పోలీసులు చెప్పారు.

    పోలీస్ స్టేషన్‌‌లో రాజశేఖర్ కారు

    పోలీస్ స్టేషన్‌‌లో రాజశేఖర్ కారు

    రాజశేఖర్‌కి చిన్నపాటి గాయాలు అయ్యాయని, ORR నుండి కారును తొలగించి పోలీస్ స్టేషన్‌కి తరలించామని పోలీసులు అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈ సందర్బంగా పోలీసులు అన్నారు. తదుపరి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

    గతంలో కూడా ఇలాగే కారు ప్రమాదం

    గతంలో కూడా ఇలాగే కారు ప్రమాదం

    గతంతో కూడా రాజశేఖర్ ఇలాగే కారు ప్రమాదానికి గురయ్యారు. 2017 సంవత్సరం అక్టోబర్ 9న ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆ రోజు రాత్రి పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రయాణిస్తున్న మరో కారుని తన కారుతో ఢీ కొట్టారు. రాజశేఖర్ ఆ రోజు తాగి డ్రైవ్ చేసినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా ఆయన తాగలేదని రుజువయ్యింది.

    English summary
    Dr. Rajasekhar met an Accident at Hyderabad Outer Ring Road. Now he is safe with small injury. Now Hyderabad police respond on his car accident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X