కికి ఛాలెంజ్.. రెజినాపై ఆగ్రహం, సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు!
కికి ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సినీ సెలెబ్రిటీలు కికి ఛాలెంజ్ వీడియోల్ని సోషల్ మీడియాలో పెడుతుండడంతో యువత ప్రభావితం అవుతున్నారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ నగర పోలీస్ లు సీరియస్ గా ఉన్నారు. ట్రాఫిక్ ఏసిపి అనిల్ కుమార్ కికి ఛాలెంజ్ పై ఆదేశాలు జారీ చేశారు.
రోడ్లపై, ఇతర ప్రాంతాల్లో కికి ఛాలెంజ్ ఘటనలు పోలిసుల దృష్టికి వెళ్లాయి. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కదులుతున్న వాహనం నుంచి దిగి పక్కనే డాన్స్ చేసే కికి ఛాలెంజ్ కు రెజీనా వంటి సినీ తారలు కూడా పెర్ఫామ్ చేస్తున్నారు.

పోలీసులు ఇప్పటికే రెజీనాని హెచ్చరించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రెజీనా లంగాఓణిలో కికి ఛాలెంజ్ కు పెర్ఫామ్ చేసిన డాన్స్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సెలబ్రిటీలు ఇలా చేస్తే ఎలా అంటూ పోలీసులు ఆమెని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











