»   » మరోసారి ఉత్తమ నటుడిగా పవన్ కళ్యాణ్

మరోసారి ఉత్తమ నటుడిగా పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన 2012 ఫిల్మ్ అవార్డులలో 'గబ్బర్ సింగ్' చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా ఎంపిక చేసారు. గతంలో పవన్ కళ్యాణ్ సిని'మా' అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ అవార్డులలో కూడా గబ్బర్ సింగ్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక ఉత్తమ నటిగా ఇష్క్ చిత్రానికి గాను నిత్యా మీనన్ ఎంపికైంది. ఆన్ లైన్ పోల్ రిజల్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రకటించారు.

అవార్డుల వివరాలు
ఉత్తమ నటుడు: పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్)
ఉత్తమ నటి: నిత్యా మీనన్ (ఇష్క్)
ఉత్తమ చిత్రం: ఈగ
ఉత్తమ దర్శకుడు: రాజమౌళి (ఈగ)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్ (గబ్బర్ సింగ్)
ఉత్తమ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి(కృష్ణం వందే జగద్దురుమ్)
ఉత్తమ గాయకుడు: దీపు(నేనే నానినె...ఈగ)
ఉత్తమ గాయిని: సుచిత్ర (సారొస్తారా... బిజినెస్ మేన్)
ఉత్తమ కామెడీ హీరో : అల్లరి నరేష్ (సుడిగాడు)
ఉత్తమ బాల నటుడు: ఆకాష్ (ధోని)
ఉత్తమ విలన్: సుదీప్ (ఈగ)
ఉత్మ విలన్ ఫిమేల్ కేటగిరి: గాబ్రియేలా బెర్టాంటె(కెమెరామెన్ గంగతో రాంబాబు)
ఉత్తమ తెరంగ్రేట నటుడు: సుధీర్ బాబు (ఎస్ఎంఎస్)
ఉత్తమ తెరంగ్రేట నటి : రెజీనా(ఎస్ఎంఎస్)
బెస్ట్ స్క్రీన్ ప్లే: తనికెళ్ల భరణి (మిథునం)
బెస్ట్ యూత్ ఫిల్మ్: ఇష్క్

ఇక పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఈ సంవత్సరం భారీ విజయం సాధించిన, భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల కెక్కింది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ నటన కూడా విమర్శకుల ప్రశంసలు అందాయి. వచ్చే ఏడాది ఈ చిత్రానికి పలు అవార్డులతో పాటు పవన్ కళ్యాణ్ నటనకు కూడా పలు అవార్డులు ఖాయం అంటున్నారు. మరి ఈ చిత్రానికి ఎన్ని అవార్డులు దక్కుతాయో చూడాలి.

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి కొస్తే...'అత్తారింటికి దారేది' చిత్రంతో మంచి జోష్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ నెక్ట్స్ 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ నెలలో ఈచిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి 'రచ్చ' ఫేం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మాత.

గబ్బర్ సింగ్ తొలి భాగం గుంటూరు జిల్లా కొండవీడు నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్‌గా దర్శనమిచ్చారు......సీక్వెల్ గబ్బర్ సింగ్ 2లోనూ పవన్ క్యారెక్టర్ అదే అయినప్పటికీ, సినిమా మధ్య ప్రదేశ్‌లోని చంబల్ లోయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

English summary
Pawan Kalyan won Best Actor Male for Gabbar Singh at Hyderabad Times Award 2012. Every time he thundered, "Naku konchem thikka undi, kani daniki oka lekka undi," audience broke into a rapturous applause in theatres across the world.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu