త్రివిక్రమ్ కు పోలీసులు షాక్, జరిమానా విధింపు.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ లకూ తప్పలేదు?

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సెలబ్రిటీలకు వరుస షాకులు ఇస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాదులో కారులో బ్లాక్ ఫిలిం వాడకం మీద పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్ లకు చెందిన కార్ ల బ్లాక్ ఫిలిం తొలగించి వారికి షాక్ ఇవ్వగా 1తాజాగా టాప్ దర్శకుడు త్రివిక్రమ్ కి కూడా పోలీసులు అదే విధంగా షాక్ ఇచ్చారు.. ఆ వివరాల్లోకి వెళితే

అనుమతి లేకుండా

అనుమతి లేకుండా

సాధారణంగా మోటార్ వాహనాల చట్టం ప్రకారం జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నవారు తప్ప ఇతరులెవరూ వాహనాల అద్దాలు పూర్తిగా బ్లాక్ ఫిలింతో మూసివేయడం నిషిద్ధం. ఎందుకంటే కారు లోపల ఏం జరుగుతుంది, లేకపోతే ఎవరు కూర్చున్నారు అనే విషయాలు బయట నుంచి అందరికీ కనబడే విధంగానే ఆ అద్దాలు ఉండాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగ్గా ఉండాలని వాహనాలకు అనుమతి లేకుండా బ్లాక్ ఫిలిం వేయొద్దని పోలీసులు చెబుతున్నారు.

బ్లాక్ ఫిలిం వాడుతూనే

బ్లాక్ ఫిలిం వాడుతూనే


కానీ అయితే సెలబ్రిటీలు అలా కనబడుతూ ఉంటే వారికి సాధారణ పబ్లిక్ తో ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం బ్లాక్ ఫిలిం వాడుతూనే ఉంటారు. అయితే ఎప్పుడైనా ఈ విషయం పోలీసుల దృష్టికి ఈ విషయాలు వస్తే వాటిని పీకి, కారుకు జరిమానా విధించి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో గాయత్రి అనే వర్ధమాన నటి రోడ్డు ప్రమాదంలో రణించింది. అయితే ఆమె మరణానికి కారణం మద్యం తాగి వాహనం నడపడమే అని పోలీసులు గుర్తించారు.

ముందు ఎన్టీఆర్ కారు

ముందు ఎన్టీఆర్ కారు

ఇక అప్పటి నుంచి పోలీసులు ఈ విషయం మీద సీరియస్ అయ్యారు. ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ సహా హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కొద్దీ రోజుల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ఎన్టీఆర్ వాహనాన్ని తనిఖీ చేసి అనంతరం అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తొలగించారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో కారులో డ్రైవర్‏తో పాటు ఎన్టీఆర్ తనయుడు కూడా ఉన్నారు.

అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ లకు కూడా తప్పలేదు

అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ లకు కూడా తప్పలేదు

ఆయన కారు ఫిలిం తొలగించిన కొద్ది రోజులకే అల్లు అర్జున్ కారుకు కూడా ఈ కారణంగానే జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని నీరూస్ చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఆయన కారుకు ఫిలిం తొలగించి 700 రూపాయల జరిమానా విధించారు. అదే దారిలో వెళుతున్న హీరో కల్యాణ్ రామ్ కారుకు పోలీసులు ఇదే తరహాలో జరిమానా విధించారు.

ఇప్పుడు త్రివిక్రమ్ వంతు

ఇప్పుడు త్రివిక్రమ్ వంతు

ఆ తర్వాత మంచు మనోజ్ కారుకు కూడా బ్లాక్ ఫిలిం తొలగించి జరిమానా విధించారు. ఇక తాజాగా జూబ్లీహిల్స్ లో సినీ దర్శకుడు త్రివిక్రమ్ కు సైతం ఈ విషయంలో జరిమానా తప్పలేదు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఆయన కారులో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు కారును అడ్డుకున్నారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉండటంతో బ్లాక్ ఫిలిం తొలగించి రూ. 700 జరిమానా విధించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X