కొత్త నటీనటులతో ‘హైదరాబాద్ టు వైజాగ్’
హైదరాబాద్: కొత్త నటీనటులతో ఎస్ఎస్ఎస్ మూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'హైదరాబాద్ టు వైజాగ్'. ఈ చిత్రం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. అనిల్ కుమార్, అజయ్, మునిరాజ్, విసికా సింగ్, మధులగ్నదాస్, ఎంజలి, సోనియాలు చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషణ్ అధ్యక్షుడు మురళీ మోహన్ తొలి సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా ప్రముఖ నిర్మాత రామానాయుడు కెమెరా స్విచాన్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ తొలి సీన్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన యువత చెడు మార్గాలు పడుతున్న తీరు, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చలేక పోతున్న వైనాన్నిచూపిస్తూ సందేశాత్మకంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ చేరుకున్న నలుగురు అమ్మాయిలు ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనే విషయం ఆసక్తికరంగా సస్పెన్స్‌తో కూడి ఉంటుందని తెలిపారు.
ఈ చిత్రానికి ఫైట్స్: నందు, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఫోటోగ్రఫీ: వెంకట్, సంగీతం: వికాస్, కథ-స్ర్ర్కీన్ ప్లే: వేను, దర్శక నిర్మాత: వసంత వరప్రసాద్.


Click it and Unblock the Notifications












