ఆ డైలాగ్ క్రియేట్ చేసింది సునీల్ అన్నే.. తాగేసి పడిపోవడమే, విజిల్స్ కొట్టారు.. హైపర్ ఆది!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత ఓ విజయాన్ని అందుకున్నాడు. తేజు నటించిన చిత్రలహరి చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస ఆరు ప్లాపుల తర్వాత సాయిధరమ్ తేజ్ చిత్రలహరి చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడు కిషోర్ తిరుమల యువతకు నచ్చే అంశంతో మ్యాజిక్ చేశాడు. చిత్రలహరి చిత్రానికి వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇటీవల చిత్రలహరి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో హైపర్ ఆది ఎప్పటిలాగే కామెడీ పంచులు వేస్తూ చిత్ర విజయానికి గల కారణాలని వివరించారు.

 నేను కూడా గ్లాస్ మేట్‌నే

నేను కూడా గ్లాస్ మేట్‌నే

హైపర్ ఆది మాట్లాడుతూ.. నేను కూడా ఈ చిత్రంలో గ్లాస్ మేట్ నే అని తెలిపాడు. క్లాస్ మేట్ అంటే క్లాస్ అయ్యేవరకు మాత్రమే. కానీ గ్లాస్ మేట్ మాత్రం మనం ఏదో ఒకటి అయ్యేవరకు తోడుంటాడు అని తెలిపాడు. క్లాస్ మేట్ తన దగ్గర రెండు పెన్నులు ఉంటే ఒకటి ఇస్తాడు. కానీ గ్లాస్ మేట్ అప్పు చేసి అయినా మనకు తోడుగా ఉంటాడు అని హైపర్ ఆది కామెడీ పంచులు వేశారు. క్లాస్ మేట్స్ మధ్య పోటీ ఉంటుంది. కానీ గ్లాస్ మేట్స్ మధ్య పోటీ ఉండదు.. ఎందుకంటే తాగేసి పడిపోవడమే కదా అని హైపర్ ఆది తెలిపాడు.

ఆ డైలాగ్‌కు విజిల్స్

ఆ డైలాగ్‌కు విజిల్స్

ఈ సందర్భంగా తనకు, సునీల్ కు మధ్య సాగే ఓ సన్నివేశం గురించి హైపర్ ఆది ప్రస్తావించాడు. ఆ సన్నివేశంలో హైపర్ ఆది, సునీల్ ఇద్దరూ లవర్స్ లాగా నటిస్తారు. నా లవర్ మందు తాగదు అంటూ హైపర్ ఆది సునీల్ వద్ద ఉన్న గ్లాస్ తీసుకుంటాడు. నీకు చెప్పి ఉండదులే అంటూ సునీల్ ఆ గ్లాసుని వెన్నకి తీసుకుంటాడు. ఆ సందర్భానికి తగ్గట్లుగా ఆ సన్నివేశాన్ని మలిచింది సునీల్ అన్నే అంటూ హైపర్ ఆది ప్రశంసలు కురిపించాడు. ఆ సన్నివేశానికి థియేటర్స్ లో అందరూ విజిల్స్ కొడుతున్నారని హైపర్ ఆది తెలిపాడు.

 పవన్ కళ్యాణ్ లాగా గడ్డం

పవన్ కళ్యాణ్ లాగా గడ్డం

సాయిధరమ్ తేజ్ గురించి మాట్లాడుతూ.. తేజు ముగ్గురు మావయ్యల ముద్దుల మేనల్లుడు అని అన్నారు. చిరంజీవిగారిలా సెట్స్ లో అందరిని సమానంగా చూసుకుంటారని, నాగబాబుగారిలా కల్మషం లేని వ్యక్తి అని హైపర్ ఆది ప్రశంసించాడు. ఇక పవన్ కళ్యాణ్ గారిలా సాయం చేసే గుణం తేజకు ఉందని తెలిపాడు. ఆయనలా ఈ చిత్రంలో గడ్డం కూడా పెంచాడని హైపర్ ఆది సరదా వ్యాఖ్యానించారు.

 కథ, డైలాగులు

కథ, డైలాగులు

చిత్రలహరి విజయానికి ప్రధాన కారణం కిషోర్ తిరుమల గారు రాసిన కథ, డైలాగులు అని హైపర్ ఆది తెలిపాడు. సాయిధరమ్ తేజ్, పోసాని మధ్య జరిగిన సంభాషణ, గ్లాస్ మేట్స్ కామెడీ, హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఈ చిత్ర విజయానికి కారణం అయ్యాయని హైపర్ ఆది తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X