సచిన్ టెండూల్కర్, చిరంజీవి ఒక్కటే.. వాళ్లకు వారిద్దరూ అలా జవాబు.. Hyper aadi కామెంట్స్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను శిల్పా కళా వేదికలో నిర్వహించింది. ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు.. దర్శక నిర్మాతలు, కీర్తి సురేష్, పలువురు దర్శకులు, నటులు హాజరయ్యారు. అంతే కాదు వేల మంది ఫ్యాన్స్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలో హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..
హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మెగా ఫ్యామిలీకి బిగ్ ఫ్యాన్. ఇక ఆయన స్పీచ్ మొదలైతే.. పూనకాలు వచ్చేస్తాయి. ఇక భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంటులో హైపర్ ఆది రెచ్చిపోయి మాట్లాడారు. మెగా ఫ్యామిలీపై ప్రశంసలు కురిపిస్తునే.. మరోవైపు విమర్శకులకు తన దైన మార్క్ పంచ్ లతో ఇచ్చి పడేశాడు. ఇక మెగాస్టార్ గురించి హైపర్ ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

హైపర్ ఆది మాట్లాడుతూ... ''నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి, సచిన్ టెండుల్కర్ ఒకటే. సచిన్ టెండుల్కర్ ను ఎవరైనా విమర్శిస్తే.. బ్యాట్ తో సమాధానం చెబుతారు. అలాగే మెగాస్టార్ చిరంజీవిని ఎవరినైనా విమర్శిస్తే.. ఆయన సినిమాతో సమాధానం చెబుతారు అని హైపర్ ఆది చెప్పారు.
ఆచార్య సినిమాతో విమర్శలు వచ్చాయి.. వాల్తేరు వీరయ్యతో సమాధానం చెబుతారు. డ్యాన్స్, ఫైట్స్ లో మార్క్ సెట్ చేసింది మెగాస్టార్. ఫస్ట్ కోటి రూపాయలకు పైగా ఇండియన్ యాక్టర్ ఎవరంటే.. మెగాస్టార్. ఫస్ట్ 10 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రం ఘరానా మొగుడు. ఇక్కడ ఉన్న చాలా మందికి ఊహ తెలియక ముందే ఆయన ఎన్నో రికార్డ్స్ కొల్లగొట్టారు. ఠాగూర్ సినిమాలో ఆయనకు నచ్చని ఓకే ఒక్క పదం క్షమించడం.. కానీ ఆయన నిజ జీవితంలో ఆయనకు నచ్చిన పదం క్షమించడం అని హైపర్ ఆది అన్నారు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయ ప్రచారం చేసే టైంలో ఎవరో గుడ్డు కొట్టాడు. ఒక్కసారి ఆయన కన్నేర్ర చేసి ఉంటే.. అక్కడే వాడికి గుండు కొట్టేవారు. ఒకప్పుడు మినిస్టర్ హోదాలో ఆయన ఓటు హక్కు గురించి లైన్ క్రాస్ చేస్తే... ఓ ఎన్ ఆర్ఐ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడాడు. చూసిన మనకు కోపం వచ్చింది. చిరంజీవికి కోపం రాలేదు. కొన్ని వేల మందికి ప్రవచనాలు చెప్పే వ్యక్తి.. కొన్ని కోట్ల మందికి అభిమానించే మెగాస్టార్ చిరంజీవి మీద అసహనం వ్యక్తం చేశారు. ఆరోజూ కూడా చిరంజీవి సహనం కోల్పోలేదు అని హైపర్ ఆది అన్నారు.
బ్లడ్ బ్యాంకులకు అవార్డులు ఇచ్చిన ప్రభుత్వాలు... రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ గురించి తప్పుడు ప్రచారాలు చేశారు. అయినా చిరంజీవి క్షమించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











