కత్తి మహేష్‌కు హైపర్ ఆది కౌంటర్.. చెప్పుతో కొట్టేవారు లేరు.. అజ్ఞాతవాసిపై రివ్యూ (వీడియో)

By Rajababu

Recommended Video

కత్తి కు హైపర్ ఆది కౌంటర్.. అజ్ఞాతవాసిపై రివ్యూ

భారీ అంచనాల మధ్య రిలీజైన అజ్ఞాతవాసి చిత్రంపై డివైడ్ టాక్ వెలువడుతున్న నేపథ్యంలో జబర్దస్త్ ఫేం హైపర్ ఆది ఆసక్తికరమైన రివ్యూను అందించారు. కత్తి మహేష్‌ రివ్యూకు ఎన్‌కౌంటర్ ఇస్తూ సినిమా గురించి విశ్లేషణను అందించారు. కత్తి మహేష్‌తో సినీ క్రిటిక్స్ ఓ వైపు సినిమాను ఏకిపారేస్తుంటే ఆది మాత్రం అండగా నిలిచారు.

 కత్తి మహేష్‌కు హైపర్ ఆది కౌంటర్

కత్తి మహేష్‌కు హైపర్ ఆది కౌంటర్

అజ్ఞాతవాసి లాంటి సీరియస్ కథకు కామెడీ ట్రీట్మెంట్ వేస్తే సినిమా అపహాస్యం అవుతుంది. కథకు చేయాల్సింది చేయక పోగా దాన్ని నాశనం చేస్తే ఎవరూ అప్రిషియేట్ చేయరు. అజ్ఞాతవాసి సినిమా విషయంలో అదే జరిగింది అని మహేష్ కత్తి తన రివ్యూను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైపర్ ఆది ఏమని స్పందించారంటే..

 అజ్ఞాతవాసి చూశాను..

అజ్ఞాతవాసి చూశాను..

అజ్ఞాతవాసి సినిమా ఇప్పుడే చూసి వచ్చాను. సినిమా మాత్రం చాలా చాలా బాగున్నది. తమ్ముడు, తొలి ప్రేమ సినిమాలోని పవన్ కల్యాణ్ కామెడీ టైమింగ్, ఈజ్ మళ్లీ అజ్ఞాతవాసిలో చూడవచ్చు.

 పదిసార్లు చూడొచ్చు..

పదిసార్లు చూడొచ్చు..

పవన్ కల్యాణ్ కోసం 10 సార్లు చూడవచ్చు. త్రివిక్రమ్ కోసం మూడు సార్లు చూడవచ్చు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, మురళీశర్మ కోసం వీలున్నప్పుడు చూడవచ్చు.

 అజ్ఞాతవాసి బ్లాక్‌బస్టర్

అజ్ఞాతవాసి బ్లాక్‌బస్టర్

అజ్ఞాతవాసి గురించి ఓ మాటలో చెప్పాలంటే బ్లాక్‌బస్టర్. ఈ చిత్రంలో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏమిటంటే.. బోమన్ ఇరానీ చెప్పిన రాజ్యం మీద ఆశలేని వాడికంటే గొప్ప రాజు ఎవరు ఉంటారు అనే డైలాగ్ నాకు బాగా నచ్చింది.

బోమన్ ఇరానీ డైలాగ్ సూపర్

బోమన్ ఇరానీ చెప్పిన డైలాగ్ పవన్ కల్యాణ్‌కు చక్కగా సరిపోయే డైలాగ్. కేవలం సినిమా కాదు.. పవన్ నిజజీవితానికి సంబంధించిన వరకు ఇది యాప్ట్. ఇలాంటి డైలాగ్స్ అజ్ఞాతవాసిలో చాలా ఉంటాయి. సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయండి అని హైపర్ ఆది అన్నారు.

రివ్యూలపై పోరాటం

కొత్త సినిమా ప్రేక్షకుడిని చేరేలోపే పురిట్లోనే చంపేస్తున్న రివ్యూలపై పోరాటం చేయడానికి హీరోలు, అభిమానులు, సినీప్రియులు సహకారం అందించాలని కోరుతున్నాను.
దయచేసి ఎవరినీ బూతులు తిట్టకండి. ఇది ఏ ఒక్కరిపైనో వ్యక్తిగత పోరాటం కాదు అని హైపర్ ఆది ట్వీట్ చేశారు.

చెప్పుతో కొట్టేవారు లేరు..

ఒక అమ్మాయిని అందంగా లేవు అని చెప్పు. చెప్పుతో కొడుతుంది. ఎవరి అందం వారిది. సినిమాలుకూడా అంతే. నచ్చేవాళ్లకు నచ్చుతుంది. కాకపోతే చెప్పుతో కొట్టే వాళ్లేలేరు అని హైపర్ ఆది మరో ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X