రీసెంట్‌గా ఫోన్ చేసి.. అంతలోనే విషాదం మిగిల్చాడు.. వేణుమాధవ్ భౌతికకాయం వద్ద హైపర్ ఆది

Recommended Video

Tollywood Celebrities Pays Homage To Venu Madhav

ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడిన వేణుమాధవ్.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో యావత్ సినీ, రాజకీయ వర్గాలు కలత చెందాయి. సినీ ప్రముఖుల సందర్శనార్థం ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని ఫిలింఛాంబర్‌లో ఉంచారు.

 పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రముఖులు.. ఘన నివాళి

పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రముఖులు.. ఘన నివాళి

ఫిలింఛాంబర్‌లో ఉంచిన వేణుమాధవ్ భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున సినీ తారలు తరలి వస్తున్నారు. ఆయనతో కలిసి నటించిన నటీనటులంతా వేణుమాధవ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. అభిమానులు, సినీ తారలతో ఫిలింఛాంబర్ ఆవరణ కిటకిటలాడుతోంది.

 మాలాంటి కొత్త కామెడియన్లకు స్ఫూర్తి

మాలాంటి కొత్త కామెడియన్లకు స్ఫూర్తి

వేణుమాధవ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన హైపర్ ఆది మీడియాతో మాట్లాడాడు. ''వేణుమాధవ్ అన్న మాలాంటి కొత్త కామెడియన్లకు ఎంతో స్ఫూర్తి. జబర్దస్త్ లో కూడా చాలామంది కామెడియన్లకు ఫోన్ చేసి వెన్నుతట్టేవారు. షూటింగ్ దగ్గరికి కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు'' అని అన్నాడు హైపర్ ఆది.

 రీసెంట్‌గా ఫోన్ చేసి..

రీసెంట్‌గా ఫోన్ చేసి..

రీసెంట్‌గా తనకు ఫోన్ చేసి వాళ్ళ చుట్టాలబ్బాయికి జబర్దస్త్‌లో ఓ స్కిట్ లో ఛాన్స్ ఇవ్వమని అడిగారని చెప్పాడు హైపర్ ఆది. మమ్మలి ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ వెన్నుతడుతూ ఉండే వేణు మాధవ్ గారికే ఇలా జరగడం చాలా బాధాకరం. అన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా అని అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు హైపర్ ఆది.

వేణు మాధవ్‌ని చూసి బోరున విలపించిన ఉదయభాను

వేణు మాధవ్‌ని చూసి బోరున విలపించిన ఉదయభాను

వేణు మాధవ్‌ భౌతికకాయాన్ని సందర్శించడానికి వచ్చిన సీనియర్ యాంకర్ బోరున విలపించింది. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కాన్నేరు మున్నీరైంది. వేణు మాధవ్ ఇకలేరు అనే విషయాన్ని జీర్ణించులేకపోయింది ఉదయభాను. వేణు మాధవ్ మరణం సినీ లోకానికి, తమ కుటుంబానికి తీరని లోటు అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X