చిన్న పెగ్గు వేస్తే చిరంజీవిని.. పెద్ద పెగ్గు వేస్తే పవన్ కల్యాణ్‌ను.. రాంగోపాల్ వర్మకు Hyper aadi వార్నింగ్
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్. ఈ సినిమాకు స్టైలిష్ ఫిలిం మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇక చిరు సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. ఇక మహానటి కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలిగా నటించింది. ఇక ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు.
ఇక భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా.. మూవీ యూనిట్ ప్రమోషన్లలో వేగం పెంచింది. ఈ నేపథ్యంలోనే భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ శిల్ప కళావేదికలో జరిగింది. భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంటులో పాల్గొన్న హైపర్ ఆది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హైపర్ ఆది మాట్లాడుతూ... ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడు నేను సైనికుడిని అవుతా అని యుద్ధ భూమిలోకి దిగారు. ఆ యుద్ధ భూమిలో కండలు తిరిగిన సైనికులు చాలా మంది ఉన్నారు. వాళ్ల యుద్దం చేస్తున్నారు.. ఇక ఒక రోజు ఈయన యుద్ధం చేశారు. గెలిచారు. ఒక ముప్పై ఏళ్లు యుద్ధభూమిని ఏలారు. ఆయన ఎవరో కాదు... మెగాస్టార్ చిరంజీవి. అన్నయ్య ఇంత మంది సినీ సైనికులను తయారు చేసి... ఇంద్రాసేనాని... తమ్ముడేమో.. జనసైనికుల్ని తయారు చేసి జనసేనాని అయ్యారు అని హైపర్ ఆది అన్నారు.
మాట్లాడే వాడికి కూడా గూస్ బంప్స్ వస్తే.. ఆయన మాట్లాడేది మెగాస్టార్ చిరంజీవి గురించి. బేసిక్ గా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ ఆయనకు హీరోలే ఫ్యాన్స్. ఆస్తులు సంపాదించడం కన్నా... అభిమానులను సంపాదించారు. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటదో లేదో చెప్పలేం కానీ... ప్రతి ఇంట్లో మెగాస్టార్ ఫ్యాన్ కచ్చితంగా ఉంటారు.
కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఉంటాయి. హీరో ఉదయ్, హీరో సుమన్ విషయాల మీద తప్పుడు న్యూస్ రాసి... సంపాదించుకుంటున్నారు. అలాంటి వారికి నేను చెప్పేది ఒక్కటే.. కష్టపడి సంపాదించుకోండి ఇలాకాదు. టాలీవుడ్ లోనే ఓ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన్ను అనే స్థాయి నాకు లేదు. అలాగే మెగాస్టార్ ను, పవర్ స్టార్ ను అనే స్థాయి ఆయనకు లేదు. చిన్న పెగ్ వేసినప్పుడు మెగాస్టార్ ను.. పెద్ద పెగ్ వేసినప్పుడు పవర్ స్టార్ ను విమర్శిస్తుంటారు. వాళ్లకి చెబుతున్నాను.. అర్థం లేని మాటలకు క్లాప్స్ రావు.. అర్థం లేని సినిమాలకు కలెక్షన్స్ రావు.. నాకు తెలిసి మీ వ్యూహాలు బెడిసి కొడతాయని అనుకుంటున్నాను.


Click it and Unblock the Notifications











