హైపర్ ఆదిపై కుట్ర!.. అలాంటి వాటితో నాకు సంబంధం లేదు.. కమెడియన్ క్లారిటీ

బుల్లితెరపై పంచ్‌ల ప్రవాహాం, ప్రాసలతో సెటైర్లు వేయడంలో హైపర్ ఆది దిట్టా. బుల్లితెరపై జబర్దస్త్ షోతో పంచ్‌లు వేస్తే.. వెండితెరపైనా అప్పుడప్పుడు కౌంటర్లతో మెరుస్తూ ఉంటాడు. జబర్దస్త్ వేదికపై నుంచి ఎదిగిన హైపర్ ఆది ఇప్పుడు బుల్లితెర స్టార్‌గా మారిపోయాడు. ఇటు ఢీ, అటు జబర్దస్త్.. మరోవైపు సినిమాలు, ఇంకో వైపు స్పెషల్ ఈవెంట్స్ ఇలా నాలుగు చేతులా సంపాదిస్తున్నాడు. తాజాగా హైపర్ ఆది సోషల్ మీడియాలో ఫైర్ అయ్యాడు.

Recommended Video

Sri Reddy Post Viral On Hyper Aadi's Marriage News
బుల్లితెర స్టార్..

బుల్లితెర స్టార్..

జబర్దస్త్ షోలో హైపర్ ఆది వేసే పంచ్‌లకు భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన స్కిట్, ఆయన ప్రాసలకు యూట్యూబ్ రికార్డులు బద్దలవుతుంటాయి. ఇక టీమ్ లీడర్‌గానే కాకుండా అవతలి వారి స్కిట్స్‌లో గెస్ట్‌గా వెళ్లి దుమ్ములేపుతుంటాడు. అయితే హైపర్ ఆది సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ కామెంట్ యాక్టివ్‌గా ఉంటాడు.

పవన్ కళ్యాణ్, జనసేన..

పవన్ కళ్యాణ్, జనసేన..

హైపర్ ఆది మెగా అభిమాని అన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, నాగబాబులతో కలిసి జనసేన కోసం పని చేశాడు. అప్పట్లో రాజకీయ వేదికలపై హైపర్ ఆది చేసిన కామెంట్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ మధ్య హైపర్ ఆది పేరిట ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయట.

ఫేక్ అకౌంట్స్..

ఫేక్ అకౌంట్స్..

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలకు ఫేక్ అకౌంట్ల బెడద ఎక్కువ అవుతోంది. ఆ మధ్య అలీకి ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా ఆయన పేరు మీదుగా ట్వీట్లు చేసేవారు. వాటిపై అలీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక తాజాగా హైపర్ ఆది వంతు వచ్చింది. ట్విట్టర్‌లో తన పేరు మీదుగా వచ్చే ట్వీట్లు తనవి కావని క్లారిటీ ఇచ్చాడు.

వాటితో సంబంధం లేదు..

వాటితో సంబంధం లేదు..

హైపర్ ఆది తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ‘ఇటీవల ట్విట్టర్ ,ఇన్స్టాగ్రామ్ ,ఫేస్బుక్ లో నా పెరు మీద కొన్ని ఫెక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది .. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు .. నేను ప్రభుత్వాన్ని ప్రజాభిప్రాయాలను గౌరవించే వాడిని... ఎవరో పనికట్టుకొని నా పేరు మీద క్రియేట్ చేసి ఈ అసత్య ప్రచారాల మీద త్వరలో సైబర్ క్రైమ్ వాళ్ళని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది .. నాకు ఈ ఫేస్బుక్ అకౌంట్ తప్ప ఇంకేమీ అకౌంట్స్ లేవు దయచేసి గమనించగలరు..' అని హైపర్ ఆది పోస్ట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X