twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొలిటికల్ వార్: రంగంలోకి హైపర్ ఆది, గబ్బర్ సింగ్ గ్యాంగ్!

    |

    Recommended Video

    Hyper Aadi And Gabbar Singh Gang In Janasena Campaign | Filmibeat Telugu

    జబర్దస్త్ కార్యక్రమంలో తన పంచులతో ప్రత్యర్థి జట్లను రఫ్ ఆడించే హైపర్ ఆది... ఏపీ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మద్దతుదారుగా ఉన్న హైపర్ ఆది తాజా ఎన్నికల ప్రచారంలో 'జనసేన' పార్టీ తరుపున ప్రచారం ప్రారంభించారు.

    జనసేన పార్టీ తరుపున తెనాలి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నాదెండ్ల మనోహర్ తరుపున హైపర్ ఆది ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ గాజు గ్లాసుకు ఓటు వేయాలని, పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నారు.

    డబ్బు లేదు, బిర్యానీ లేదు

    డబ్బు లేదు, బిర్యానీ లేదు

    ఇతర పార్టీలకు రూ. 500 లేదా బిర్యానీ ఇస్తే జనాలు వస్తారు. కానీ జనసేన అంటే చాలు జనాలు స్వచ్ఛందంగా వచ్చి వారంతటవారు సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతోందని ఆది అన్నారు.

    దేశంలోనే తొలిసారిగా

    దేశంలోనే తొలిసారిగా

    2019 ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధించబోతోందని చెప్పిన ఆది...దేశంలోనే తొలిసారిగా రైతులకు పెన్షన్ ప్రకటించిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. సామాన్యుడి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సీటు ఇచ్చి మార్పు కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆది తెలిపారు.

    పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి

    పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి

    పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే తెలుగు ప్రజలకు మంచి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున గెలవబోయే మొట్టమొదటి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కావాలని, అందుకే తాను తెనాలి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నట్లు ఆది తెలిపారు.

    గబ్బర్ సింగ్ గ్యాంగ్

    గబ్బర్ సింగ్ గ్యాంగ్

    మరో వైపు పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన గబ్బర్ సింగ్ గ్యాంగ్ మంగళగిరి జనసేన పార్టీ కార్టాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. వీరు కూడా జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

    English summary
    Hyper Aadi and Gabbar Singh gang in Janasena campaign. They are asking people to vote for the Janesena Party. "If Pawan Kalyan is elected as Chief Minister, good administration will be done to the state." Hyper Aadi said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X