జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా హైపర్ ఆది.. పవన్ ను కలవడంపై కూడా క్లారిటీ ఇచ్చేశాడుగా!
జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హైపర్ ఆది ఇప్పుడు జబర్దస్త్ కి ఫేస్ లాగా మారిపోయాడు తాజాగా కిరాక్ ఆర్పి చేసిన వ్యాఖ్యల మీద కౌంటర్ ఇచ్చేందుకు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక అదే ఇంటర్వ్యూలో తాను జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే విషయం పైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.. ఆ వివరాల్లోకి వెళితే

తక్కువ కాలంలోనే
బీటెక్ చదివి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే హైపర్ ఆది ఒక చిన్న షార్ట్ ఫిలిం చేయడం ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించాడు అదిరే అభి కంటపడడంతో తన టీం లో జాయిన్ అవ్వాల్సిందిగా అవి కోరడం అలా అవి టీం ద్వారా జబర్దస్త్ ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయాయి అవి టీంలో ఎంట్రీ అతి తక్కువ కాలంలోనే ఆది మంచి గుర్తింపు సంపాదించాడు దీంతో ఆదిని స్వయంగా టీం లీడర్ ని కూడా చేసేశారు మల్లెమాల సంస్థ వారు.

హాట్ టాపిక్ అవుతూ
అలా అతి తక్కువకాలంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హైపర్ ఆదికి ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా అవుతున్నాయి. నిజానికి ముందు నుంచి హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ పై అభిమానం ఉందని ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంటాడు. పలు వేదికలపై హైపర్ ఆది ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచేలా పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడడం కూడా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది.

పవన్ కళ్యాణ్ మారడని
రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా కలిశానన్న ఆది క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రం కోసం నేను కూడా చిన్న పాత్ర చేస్తున్నానని అన్నారు. ఆ సినిమా షూట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా కలిశానని వెల్లడించారు. ఇక డబ్బు అనే దానిపై ఆయనకు ఆసక్తి లేదని, డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది కానీ పవన్ కళ్యాణ్ మారడని అన్నారు.

పని అప్పజెప్పితే
అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచిస్తాడని, సినిమాల ద్వారా వచ్చే తన సొంత డబ్బులు పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు పంచుతున్నారని హైపర్ ఆది వెల్లడించారు. ఇక అలాంటి వ్యక్తి కోసం పనిచేయడానికి నేను కూడా రెడీ అని ఆది అన్నారు. నాగబాబు గారు ఎన్నికల ప్రచారానికి పిలిచి ఏదైనా పని అప్పజెప్పితే తప్పకుండా చేస్తా అని ఆది అన్నారు.

ఎన్నో చూసి ఈ స్థాయికి
అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా అని యాంకర్ ప్రశ్నించగా అలాంటిది ఏమి లేదని హైపర్ ఆది అన్నారు. అయితే ఒక వేళ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పిలిచి టికెట్ ఇస్తే అని ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారని అన్నారు. మాకు కూడా ఎంతో అనుభవం కావాలి.. ఇప్పుడే కాదని ఆది చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











