ముంచిన వాళ్లను చిరంజీవి క్షమిస్తాడు.. కానీ పవన్ కల్యాణ్ వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్.. Hyper Aadi సంచలన కామెంట్

మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఇక ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహారించారు. ఇక ఈ మూవీ ప్రీరిలిజ్ ఈవెంట్ శిల్పా కళా వేదికలో జరిగింది. ఈ వేడుకలో హైపర్ ఆది సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

చిరంజీవి వారసుడు రామ్ చరణ్ గారు.. ఆయన చిరుత చిత్రం ద్వారా ఆరంగేట్రం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కడు కావాలని ఏవో కామెంట్స్ చేశారు. సినిమా హిట్ అయితే డైరెక్టర్ వల్ల.. ఫ్లాప్ అయితే రామ్ చరణ్ వల్ల అంటూ కొంత మంది కామెంట్స్ చేశారు. ఇక అప్పుడు వచ్చిందండి రంగస్థలం అనే సినిమా. నోరెత్తిన ప్రతి ఒక్కడు చేయి ఎత్తి జై కొట్టారు. కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరు కామ్ గా ఉండిపోయారు. సచిన్ టెండుల్కర్ కొడుకు సచిన్ అవ్వలేదు.. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ అవ్వలేదు.. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యారు అని హైపర్ ఆది తెలిపారు.

Hyper aadi Sensational Comments About Chiranjeevi and Pawan Kalyan at Bholaa Shankar pre realease event

కొణిదెల వెంకట్రావు గారికి చిరంజీవి ఎంత పేరు తెచ్చారో.. కొణిదెల చిరంజీవి గారికి కొణిదెల రామ్ చరణ్ గారు అంతే పేరు తెచ్చారు. మెగాస్టార్, పవర్ స్టార్... కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి... మెగా పవర్ స్టార్ అనే పేరు పెట్టుకున్నారు అనుకోవచ్చు.. కానీ గ్లోబర్ స్టార్ పెట్టుకుంటే వచ్చిన పేరు కాదు... ఇక్కడ ఉన్న హీరోలను తట్టుకుని.. వాళ్లందరినీ నెట్టుకుని.. చిరంజీవి గారి పేరు నిలబెట్టుకుని.. ఎంత ఎదిగినా చేతులు కట్టుకుని రామ్ చరణ్ ఒదిగి ఉంటారు అని హైపర్ ఆది అన్నారు.

ఇంకా కొంత మంది ఉంటారు. అన్నయ్యను పోగిడి.. తమ్ముడిని తిట్టేస్తుంటారు. తమ్ముడిని తిట్టి.. అన్నయ్యను తిడితే.. ఆయన సంతోష పడేవారా.. నేను ఓ సారి భోళా శంకర్ సెట్లో అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటే.. పాలిటిక్స్ గురించి వచ్చింది. నేను పాలిటిక్స్ చూడటం లేదు అన్నారు . ఎందుకు అన్నయ్య అంటే.. నా తమ్ముడిని తిడుతుంటే.. నేను సహించలేకపోతున్నాను అన్నారు అని హైపర్ ఆది అన్నారు.

చిరంజీవి తనను అవమానించిన వాళ్లను ఆయన వదిలేస్తాడేమో కానీ.. తమ్ముడు మాత్రం వారిని గుర్తు పెట్టుకుని వడ్డీతో సహా రిటర్న్ ఇచ్చేస్తారు. చిరంజీవి గారు అభిమానులను ప్రేమిస్తారు.. శత్రువులను క్షమిస్తారు. నాగేంద్ర బాబు.. అన్నదమ్ముల కోసం అడ్డంగా నిలబడతారు. పవన్ కల్యాణ్ గారు.. అందరి లెక్క తేలుస్తాడు.. అనుకున్నది సాధిస్తాడు. అన్నయ్య మంచోడు కాబట్టి.. ముంచేశారు.. తమ్ముడు మొండోడు.. తాడో పేడో తేల్చేస్తాడు అని హైపర్ ఆది అన్నారు.

Hyper aadi Sensational Comments About Chiranjeevi and Pawan Kalyan at Bholaa Shankar pre realease event

ఈ ముగ్గురు డబ్బు మీద ఆశలేని వ్యక్తులు.. మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల గురించి తప్పుడు వార్తలు రాస్తే.. కుర్చీ మడత బెట్టి.. ఇది కింది స్థాయి వాళ్లకు అర్థం కాదు. మినిమం డిగ్రీ చేసి ఉండాలి. అలా జరిగిందంటూ.. ఇక భోళా శంకర్ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ సినిమా వర్కౌట్ అవుతుంది. చిరంజీవి వన్ మ్యాన్ షో చూస్తారు. ప్రోడ్యూసర్ కు రిస్క్ అవసరం లేదు. ఈ మధ్య ఎలక్షన్స్ గురించి మాట్లాడిల్సిన వారు.. కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి చూడని సక్సెస్ లు లేవు. నేను ఈ సినిమా మెహర్ రమేశ్ గారికి సక్సెస్ తేవాలని కోరుకుంటున్నాను అని హైపర్ ఆది తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X