ప్రదీప్‌కు కూడా బ్యాగ్రౌండ్ ఉంది.. అందుకే సినిమా అలా అయింది: హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్

అద్భుతమైన టైమింగ్.. ఆకట్టుకునే మేనరిజం.. అన్నింటికీ మించి అదరగొట్టే పంచులతో యాంకరింగ్‌కు సరికొత్త నిర్వచనం చెబుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై తన హవాను చూపిస్తోన్న అతడు.. టాప్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. దీనికి హాజరైన హైపర్ ఆది.. ప్రదీప్ బ్యాగ్రౌండ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

‘30 రోజుల్లో' అంటూ హీరోగా మారిన యాంకర్

‘30 రోజుల్లో' అంటూ హీరోగా మారిన యాంకర్

తనదైన శైలి యాంకరింగ్‌తో తెలుగు బుల్లితెరపై టాప్ హోస్ట్‌గా వెలుగొందుతున్నాడు యాంకర్ ప్రదీప్. చాలా కాలంగా టెలివిజన్ రంగంలో తన హవాను చూపిస్తోన్న అతడు.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మున్నా తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్వీ బాబు నిర్మించారు. ఇందులో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ సంగీతం అందించాడు.

రిలీజ్‌కు ముందే రికార్డులు... అందుకే బిజినెస్

రిలీజ్‌కు ముందే రికార్డులు... అందుకే బిజినెస్

షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. పలు కారణాల వల్ల '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే 'నీలి నీలి ఆకాశం' అనే పాట విడుదలై రికార్డులు క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ దీన్ని రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ కారణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.

మూవీకి మిక్స్‌డ్ టాక్.. ప్రదీప్‌కు మాత్రం అలా

మూవీకి మిక్స్‌డ్ టాక్.. ప్రదీప్‌కు మాత్రం అలా

ప్రదీప్ నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ఎన్నో అంచనాల నడుమ గత శుక్రవారం విడుదలైంది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మిశ్రమ స్పందనే వచ్చింది. కానీ, హీరోగా మొదటి సినిమా చేసిన ప్రదీప్ నటనపై మాత్రం అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండు విభిన్నమైన పాత్రల్లో అతడు ఒదిగిపోయి నటించాడని సినిమాను చూసిన ప్రేక్షకులంతా చెబుతున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ అలా.. కలెక్షన్లు ఊహించనిలా

ప్రీ రిలీజ్ బిజినెస్ అలా.. కలెక్షన్లు ఊహించనిలా

యాంకర్ ప్రదీప్‌ మొదటి సినిమా కావడంతో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'కు అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 4.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మిక్స్‌డ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, ఊహించని విధంగా నాలుగు రోజుల్లోనే టార్గెట్‌ను ఫినీష్ చేసేసింది. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల వరకూ లాభాలను అందుకుంది.

సక్సెస్ మీట్‌లో హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్

సక్సెస్ మీట్‌లో హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్

'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఫంక్షన్‌కు చిత్ర యూనిట్‌తో పాటు జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా మూవీ విజయంపై మాట్లాడుతూ.. ప్రదీప్ బ్యాగ్రౌండ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రదీప్‌కూ బ్యాగ్రౌండ్ ఉంది.. అందుకే రిజల్ట్ అలా

ప్రదీప్‌కూ బ్యాగ్రౌండ్ ఉంది.. అందుకే రిజల్ట్ అలా

ఈ ఫంక్షన్‌లో ఆది మాట్లాడుతూ.. 'ప్రదీప్ సినిమా మా సినిమా అని అంతా అనుకున్నాం. అందుకే అతడి విజయానికి అందరం సంతోషిస్తున్నాం. వాస్తవానికి ప్రదీప్‌కు బ్యాగ్రౌండ్ లేదు అంటారు. కానీ, అతడి టాలెంటే పెద్ద బ్యాగ్రౌండ్. దాని వల్లే '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ఘన విజయం సాధించింది. ఈ మూవీ సక్సెస్ ఎంతో మంది కొత్త వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది' అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X