పవన్ కళ్యాణ్ తోనూ ఇలాగే ఉంటాను, మారండ్రా నాయనా: కత్తి మహేష్ పోస్ట్

Recommended Video

మారండ్రా నాయనా ! వైరల్ అవుతున్న కత్తి మహేష్ పోస్ట్

జబర్దస్థ్ షో లో హైపర్ ఆది చేసే స్కిట్ లకి కాస్త ఫాలోయింగ్ ఎక్కువే, దాదాపు వాట్సాప్, ఫేస్బుక్లలో వచ్చే జోకులనే కాపీకొట్టి "పంచ్" లుగా వాడే ఆదీ స్కిట్స్లో గతం లోనే రామ్‌గోపాల్ వర్మ మీద కూడా సెటైర్లు వేసాడు... రాత్రి బోరుకొడితే ఓడ్కా బాటిల్ ఓపెన్ చేసి ట్విట్టర్ ఓపెన్ చేస్తాడంటూ ఇన్‌డైరెక్ట్ గా రామ్‌గోపాల్ వర్మ మీద వేసిన సెటైర్లకే ఆది మీద కొంత వ్యతిరేకత వచ్చింది జనాల్లో.

 మహేష్ కత్తి

మహేష్ కత్తి

ఈ మధ్య పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ దగ్గర్నుంచీ మహేష్ కత్తి ఎదుర్కుంటున్న సమస్యలు మనందరికీ తెలిసినవే అదే సమయం లో హైపర్ ఆది కూడా మహేష్ కత్తిని టార్గెట్ చేస్తూ ఒక స్కిట్ వేసాడు. గతంలోనూ హైపర్ ఆది చేసిన స్కిట్‌లు కత్తి మహేశ్‌పై పంచ్‌లు వేసేలా ఉన్నాయి.

భారీగా ఫోన్ కాల్స్

భారీగా ఫోన్ కాల్స్

బిగ్ బాస్‌ షోలో పాల్గొన్న తర్వాత మహేశ్ పవన్ కల్యాణ్ విమర్శలు చేయడంతో.. పవన్ ఫ్యాన్స్ అతడిని తీవ్రంగా విమర్శించారు. తనను బెదిరిస్తూ.. భారీగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని గతంలో కత్తి మహేశ్ వాపోయాడు. ఫేస్‌బుక్ లైవ్ సందర్భంగా కత్తి మహేశ్ బదులిస్తూ.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సైలెంట్‌గా ఉండటమే అతడికి మంచిదని సలహా ఇచ్చాడు.

 ఉండేందుకే ఇష్టపడతా

ఉండేందుకే ఇష్టపడతా

నేను ఇలా ఉండేందుకే ఇష్టపడతా. నా పొట్ట, నా బట్ట నాకు నిజంగా గర్వకారణం అని చెప్పాడు. పవన్‌ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అంటే.. అతడి వ్యక్తిగత విషయాలు, అపియరన్స్ గురించి మాట్లాడానా? కాస్త బుద్ది తెచ్చుకొని మాట్లాడండి అంటూ ఘాటుగా విమర్శించాడు. చివరగా.. నీ షోను నువ్వు ఎంజాయ్ చేయ్.

 ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ

ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ

కానీ బాడీ షేమింగ్ గురించి తగ్గిస్తే మంచిది, నా బాడీ గురించి నేను హ్యాపీగా ఉన్నానని హైపర్ ఆదికి సలహా ఇచ్చాడు. ఆ గొడవ అక్కడితో అయిపోతే బాగానే ఉండేది గానీ మళ్ళీ కొత్తగా ఈ ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ ఫొటోలకి ఫోజులిచ్చారు. పైగా ఆ ఫొటో తెచ్చి తన వాల్ మీదకూడా పోస్ట్ చేసిన మహేష్ కత్తి జనాలకి షాకిచ్చాడు.

 లండన్ బాబులు

లండన్ బాబులు

బుధవారం హైదరాబాద్‌లో "లండన్ బాబులు" ప్రీమియర్ షో వేసింది చిత్ర యూనిట్. దీనికి పలువురు సినీ ప్రముఖులతో పాటు కత్తి మహేశ్, హైపర్ ఆది కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్తి మహేశ్, హైపర్ ఆది కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోల్లో ఒక దానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కత్తి మహేశ్..

వ్యక్తిగత వైరాలు ఉండవు

వ్యక్తిగత వైరాలు ఉండవు

"కలిస్తే మేమూ మేమూ బాగానే ఉంటాం. విభేదాలు విషయాలకు సంబంధించి, పరిస్థితులకు లేదా సిద్దాంతాలు సంబంధించి ఉంటాయేగాని, వ్యక్తిగత వైరాలు ఉండవు. ఆ విషయం తెలియక, అర్థం కాక ఫ్యాన్స్ అనే పిచోళ్ళు నానా రభసా చేసి, వాళ్ళ జీవితాలు సంకనాకించుకుంటారు.

 మేలుకొండ్రా నాయనా

మేలుకొండ్రా నాయనా

మేలుకొండ్రా నాయనా! రేపోమాపో పవన్ కళ్యాణ్‌ని కలిసినా ఇలా నవ్వుతూ ఫోటో దిగగలను. తరువాత వెధవలు అయ్యేది మీరే!'' అంటూ పవన్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X