For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహాత్మా గాంధీ వల్ల కానిది నేను సాధించా:కమల్ హాసన్

By Srikanya
|

హైదరాబాద్: మహాత్మా గాంధీ వల్ల కానిది తాను సాధించానంటూ ప్రముఖ నటుడు కమల్ హాసన్..వ్యంగ్య బాణాలు విసిరారు. ఆయన రీసెంట్ గా ఉత్తమ విలన్ విడుదల సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...ఇలా స్పందించారు. నా సినిమాలను వ్యతిరికేంచటానికి హిందువులు,ముస్లింలు ఒకటయ్యారు...గాంధీజీ ఇలా వీరని కలపటం అనేది సాధించలేకపోయారు..నావల్ల జరిగింది అన్నారు.

'ఉత్తమ విలన్‌' చిత్రంలో హిందూ దేవుళ్లను హేళన చేస్తూ పాట చిత్రీకరించారని... దానిని తొలగించాలని విశ్వహిందూ పరిషత్తు ఆందోళనకు దిగింది. ఈ విషయమై ఉదయం 10 గంటలకు చేపాకంలోని అతిథిగృహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించింది. చెన్నై విభాగ నిర్వాహకులు కేఎల్‌ సత్యమూర్తి నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్రంలోని 'వెట్కం కెట్ట పండ్రి పిరవి..' అనే పాట అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు. దీన్ని సినిమా నుంచి తొలగించాలని ఇప్పటికే చిత్ర యూనిట్‌ను కోరామన్నారు. వారు పట్టించుకోలేదని.. అందుకే ఆందోళనకు దిగామని చెప్పారు. ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇక ..కోర్టు ఏమంటందంటే...

I achieved what Gandhi couldn't, says Kamal

కమల్‌ హాసన్ హీరోగా నటించిన 'ఉత్తమ విలన్‌' వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించారు. పూజాకుమార్‌, ఆండ్రియా, పార్వతీ మేనన్‌ హీరోయిన్లు. సి.కల్యాణ్‌ నిర్మాత. ఈ చిత్రానికి విశ్వహిందూ పరిషత్ నుంచి అడ్డంకులు వచ్చాయి. మద్రాస్ హై కోర్టుకి వెళ్లిన ఈ కేసు...సోమవారం...కొట్టేశారు. అలాగే వివాదానికి కారణమైన చిత్రంలోని పాటను కూడా తొలిగించక్కర్లేదని తేల్చి చెప్పింది.

మరో ప్రక్క 'విశ్వనటుడు' కమల్‌హాసన్‌ నటించిన 'ఉత్తమ విలన్‌' చిత్రాన్ని అనుకున్నట్టుగానే మే ఒకటో తేదీన విడుదల చేసి తీరుతామని నిర్మాతల మండలి అధ్యక్షుడు థాణు తెలిపారు. 'ఉత్తమ విలన్‌'పై పలు సమస్యలు, వ్యతిరేకత ఎదురవుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు థాణు, డిస్ట్రిబ్యూటర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రామసుబ్బు, థియేటర్‌ యజమానుల సంఘం అధ్యక్షుడు రామనాథన్‌, ఫెప్సీ సంఘం అధ్యక్షుడు శివ తదితరులు పాలుపంచుకున్నారు. 'ఉత్తమ విలన్‌' చిత్ర విడుదలకు సినీ సంఘాల తరఫున అన్నివిధాలా సహకరిస్తామని అన్నారు.

అలాగే..విశ్వరూపం కు చెందిన సమస్యలు ఏమీ కూడా ఉత్తమ విలన్ కు సంభందం లేదని, ముందు అనుకున్నట్లుగానే మే 1న విడుదల చేసుకోవచ్చుని తెలిపారు. విశ్వరూపం కు చెందిన కొన్ని ఫైనాన్సియల్ సమస్యలు..ఇప్పుడు ఉత్తమ విలన్ నిర్మాత లింగు స్వామి ని ఇబ్బంది పెడుతున్న నేపధ్యంలో వారు ఇలా క్లియర్ చేసారు.

ఉత్తమ విలన్ చిత్రంపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) పేర్కొంది. ఆ చిత్రంలోని సన్నివేశాలు హిందూవుల మనోభావాలను కించే పరిచే అవకాశం ఉన్న కారణంగా నిలుపుదల చేయాలంటూ పోలీస్ కమిషనర్ కు వీహెచ్ పీ ఓ నివేదికను సమర్పించింది.

వివాదం ఏమిటంటే..

కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఉత్తమ విలన్' చిత్రం విడుదలకు ముందే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ చిత్రంపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) తమిళనాడు వింగ్ ఆందోళన ప్రారంభించింది. ఆ చిత్రంలోని సన్నివేశాలు హిందూవుల మనోభావాలను కించే పరిచే అవకాశం ఉన్న కారణంగా నిలుపుదల చేయాలంటూ పోలీస్ కమిషనర్ కు వీహెచ్ పీ ఓ నివేదికను సమర్పించింది.

విష్ణుమూర్తి భక్తుడు ప్రహ్లాదనకు, హిరణ్యకశపుడు అనే రాక్షసుడికి జరిగే సంభాషణ ఆధారంగా తెరకెక్కిన ఒక పాట విష్ణుమూర్తి భక్తులను నిరాశకు గురిచే విధంగా ఉందని, మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదు.

చిత్ర దర్శకుడు రమేష్‌ అరవింద్‌ మాట్లాడుతూ ‘‘ఇందులో కమల్‌హాసన్‌గారు రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఎనిమిదో శతాబ్దానికి చెందిన తెయ్యమ్‌ ఆర్టిస్ట్‌ (ప్రత్యేకమైన మేకప్‌తో కేరళలో ప్రదర్శించే పురాతన కళ)గా, సినిమా ఆర్టిస్ట్‌గా రెండు పాత్రల్లోనూ మెప్పిస్తారు. తెయ్యమ్‌ ఆర్టిస్ట్‌గా నటించడానికి ఆయన ఎక్కువగా శ్రమించారు. ఆ పాత్రకు మేకప్‌ వేసుకోవడానికి దాదాపు నాలుగు గంటలు పట్టేది. కె.బాలచందర్‌, కె.విశ్వనాథన్‌ ఇందులో కీలక పాత్రలను పోషించారు. వాళ్లను దర్శకత్వం వహిస్తూ చాలా విషయాలను నేర్చుకున్నాను'' అని తెలిపారు.

కమల్‌హాసన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘ఉత్తమవిలన్‌'. ఎన్‌.లింగుస్వామి, కమల్‌హాసన్‌ నిర్మాతలు. ఆండ్రియా జెరీమియా, పూజా కుమార్‌, పార్వతి, జయరామ్‌, పార్వతి నాయర్‌ కీలక పాత్రధారులు. తిరుపతి బ్రదర్స్‌, రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. గిబ్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

English summary
In an interview Kamal Hassan says that the Hindus and Muslims are joining hands together to oppose my movies. 'This is very big achievement of mine, even Gandhiji couldn't', he further said.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more