తల్లి ఒత్తిడితో ఆ హీరోయిన్ ఆ పని చేస్తుందా?
త్రిష అంటే నాకు చాలా ఇష్టం, ఆమెను ఆరాధించే అభిమానుల్లో నేను ఒకరిని అంటూ...తన మనసులోని మాటను బయట పెట్టింది రంగం హీరోయిన్ కార్తీక. ఎన్టీఆర్ దమ్ము చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్ పాత్రలో చేస్తుండగా కార్తీక సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మేరకు దమ్ము షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కార్తీక మీడియా ఈ వియాన్ని వెల్లడించింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్లో డిగ్రీ చేస్తున్న కార్తీక తనకు నటన కంటే హోటల్ వ్యాపారంలో నాణించడమే ఇష్టమని తెగేసి చెప్పింది. తల్లి ఒత్తిడి మేరకు, ఆమె మాటను కాదనలేకే తాను సినిమాల్లో కొనసాగుతున్నాను అనే అర్థం వచ్చేలా మాట్లాడింది కార్తీక.
తన తండ్రి ముంబైలో హోటల్ బిజినెస్ చేస్తున్నాడని, తనకు ఆ రంగంలో రాణించాలని ఎంతో ఆశగా ఉందని, త్వరలోనే తన నష్టమైన రంగంలోకి అడుగు పెడతానని చెబుతోంది. సినిమా రంగంలో కెవి ఆనంద్, లెనిన్ లాంటి పెద్ద పెద్ధ దర్శకులతో పని చేయడం ఉంతో సంతోషంగా ఉందని చెప్పంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దమ్ము సినిమాతో పాటు, మరో రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











