ఆమె మరెవరో కాదు...బిపాసాబసు. బచనా య హసీనా సినిమా లో ఆమె తన కన్నా చిన్న వారితో నటించింది. దాంతో ఆమెకు హఠాత్తుగా తన వయస్సు సీనియారిటీ గుర్తువచ్చాయట. దాంతో ఆమె తనను తాను అమితాబ్ బచ్చన్ లా ఫీలివుతున్నానని అంటోంది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమెను దర్శకుడుతో సహా అందరూ సీనియర్ హీరోయిన్ అని పిలిచి,అలాగే ట్రీట్ చేసేవారుట. దానికి ఆమె చాలా ఆనందపడి అందులో నటించిన రణబీర్ కపూర్,దీపికా పడ్కోనీ,మినీషా లంబా,కరన్ కపూర్ లను పొగుడుతోంది. వారి నటనా వయిస్సు తక్కువయినా అధ్భుతంగా చేసారని ముచ్చటపడుతోంది. అయితే ఇప్పుడు ఆమెను సీనియర్స్ లెక్కలో వేసి హీరోయిన్ పాత్రల నుండి రిటైర్ అవ్వమంటారేమో అని అంటే...చూద్దాం ప్రౌఢ అందాలు మిస్ అవటానికి వారు రెడీ అవుతారని నేను అనుకోను అని రిటార్ట్ ఇచ్చింది.