సెక్స్ చిత్రాల్లో నటించాలనే కోరిక ఉంది
ఎప్పటికైనా బూతుచిత్రాల్లో హీరోగా చేయాలని ఉందని చెప్పి బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మేనేజ్‌మెంట్ గురు అరిందమ్ చౌదరి రాసిన 'డిస్కవర్ ద డైమండ్ ఇన్ యు' పుస్తకావిష్కరణ సందర్భంగా షారుఖ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎందుకు మీకీ ఆలోచన పుట్టిందంటే..తాను హాలీవుడ్ సూపర్‌స్టార్ గా సిల్వెస్టర్ స్టాలోన్ ఫ్యాన్ ని అని చెప్పారు. స్టాలోన్ స్టార్ గా ఎదిగేముందు బూతుచిత్రాల్లోనే నటించాడని, అందుకే తాను కూడా ఆయన స్థాయికి ఎదగాలంటే ముందు బూతుచిత్రాల్లో నటించాలనుకుంటున్నానని చెప్పాడు. ప్రపంచంలోనే అతి పెద్ద బూతు నటుడిని అయిన తర్వాత అమెరికా వెళ్లి అక్కడో జెండా పాతి వస్తానని కూడా సరదాగా అన్నాడు. ఇంతకీ హఠాత్తుగా షారూఖ్ ఈ జోక్ ఎందుకు వేశాడంటే..తాను ఆవిష్కరించిన ఆ పుస్తకంలో స్టాలోన్ మొదట పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించి ఎదగటం ఉదహరణగా అరింధిమ్ చౌదరి పేర్కొన్నాడట. అంతేగాక చివరలో తాను పేల్చిన జోక్ కు ముక్తాయింపుగా షారూఖ్..అక్కడక్కడా నాలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. రాంగ్స్ ధింగ్స్ నుంచి ప్రేరణ తీసుకునేవారు అన్నారు. అంటే అటువంటి అంశాలు పాపులర్ పుస్తకాల్లో ప్రస్తావించకూడదని ఇండైరక్ట్ గా అరింధమ్ కు సూచించనట్లా..!?


Click it and Unblock the Notifications











